BigTV English

OTT Movie : నట్టనడి దీవిలో సోల్జర్ చేతికి సింగిల్ గా చిక్కిన నన్… ఆ పని చేద్దామంటూ బలవంతం

OTT Movie : నట్టనడి దీవిలో సోల్జర్ చేతికి సింగిల్ గా చిక్కిన నన్… ఆ పని చేద్దామంటూ బలవంతం

OTT Movie : ఈమధ్య ఓటిటి ప్లాట్ ఫామ్స్ హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లలోనే సినిమాలు చూసేవాళ్ళు. ఆ తర్వాత  బుల్లితెరవైపు ప్రేక్షకుల చూపు పడింది. చాలా కాలం వరకు బుల్లితెర హవా కూడా నడిచింది. ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా నడుస్తుంది. దీనివల్ల స్మార్ట్ ఫోన్లో కూడా సినిమాలను వీక్షించే అవకాశం వచ్చింది. ఇందులో ఎప్పుడయినా సినిమాలను చూసుకునే వెసులుబాటును ఓటిటి సంస్థలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక లవ్ డ్రామా తో సాగుతుంది. ఈ సినిమా డిజిటల్ మీడియా, బుల్లితెర లేని రోజుల్లోనే థియేటర్లలో సందడి చేసింది. ఆ మూవీ పేరేమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

ఈ మూవీ పేరు మరేమిటో కాదు “హెవెన్ నోస్ మిస్టర్ అలీసన్” (HEAVEN KNOWS M.R ALLISON). ఈ సినిమాను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే సన్నీవేషాలతో పాటు లవ్ ట్రాక్ ను జత చేసి మేకర్స్ అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే..

ఒక సోల్జర్ లైఫ్ బోట్లో సముద్ర మార్గం ద్వారా ఒక ప్రమాదం నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటాడు. అతనికి కొంత దూరంలో ఒక దీవి కనపడుతుంది. అతను ఆ దీవిలోకి వెళ్తే అందులో ఎవరూ ఉండరు. దీవి మొత్తం వెతకగా ఒకచోట చర్చి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ చర్చ్ ఉండడాన్ని అతను నమ్మలేకపోతాడు. అందులో ఒక నన్ మాత్రమే ఉంటుంది. ఆమె సోల్జర్ ని చూసి భయపడి నువ్వు జపాన్ వాడివి కాదు కదా అంటుంది. కాదు నేను అమెరికన్.. ఒక ప్రమాదం నుంచి బయటపడి ఇక్కడికి వచ్చాను అని చెప్పి, తన గురించి పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత సోల్జర్ తో ఆమె ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్తుంది. జపనీయులు మా వారిని తీసుకొని వెళ్ళిపోయారు. చర్చి ఫాదర్, నేను మాత్రమే ఇక్కడ మిగిలాము. ఫాదర్ కూడా చనిపోవడంతో ఇక్కడే సమాధి చేసి నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటున్నాను అని చెప్తుంది. ఇంతలో జపనీయులు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నిటిని బూడిద చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సోల్జర్ నువ్వు ఒంటరిగా ఎందుకు ఉంటావు నన్ను పెళ్లి చేసుకో అని ఆమెతో అంటాడు. అందుకు ఆమె ఒప్పుకోదు. తనను బలవంతం చేయడానికి ట్రై చేయగా ఆమె అక్కడి నుంచి కొంత దూరం వెళ్లి స్పృహ తప్పి పడిపోతుంది. ఇంతలో సోల్జర్ అక్కడికి వచ్చి ఆమెను భుజాన వేసుకొని చర్చికి తీసుకొని వెళ్తాడు. ఈ సోల్జర్ కోసం జపనీయులు కూడా వెతుకుతూ ఉంటారు. చివరికి చర్చికి తీసుకువెళ్లిన ఆమెను సోల్జర్ ఏం చేస్తాడు? ఆ సోల్జర్ జపనీయులకు దొరుకుతాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “హెవెన్ నోస్ మిస్టర్ అలీసన్” (HEAVEN KNOWS M.R ALLISON) అనే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ హాలీవుడ్ చిత్రాలను వీక్షించే ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. పాత చిత్రమే అయినా అప్పట్లోనే మంచి మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×