BigTV English

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie : స్పై థ్రిల్లర్ స్టోరీలు ఇచ్చే థ్రిల్ మరో లెవల్ లో ఉంటుంది. అందులోనూ భారత్, పాక్ మధ్య గూఢచర్యం అంటే మాటలు కాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ భారత్-పాకిస్తాన్ న్యూక్లియర్ రేస్ నేపథ్యంలో జరుగుతుంది. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవితం నుండి ఈ కథ స్ఫూర్తి పొందింది. ఈ స్టోరీ 1978, 2025 టైమ్‌లైన్‌లలో సాగుతుంది. గూఢచర్యం, రాజకీయ గేమ్‌లు, ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులకు కావాల్సిన థ్రిల్ ను ఇస్తుంది. అజిత్ దోవల్ లాంటి రియల్-లైఫ్ స్పై లెజెండ్‌ని ఇన్‌స్పైర్ చేసిన ఈ సిరీస్ పై మీరుకూడా ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.


జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

‘సలాకార్’ (Salakaar) ఒక హిందీ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి ఫరూక్ కబీర్ దర్శకత్వం వహించారు. ఇందులో నవీన్ కస్తూరియా (అధీర్ దయాళ్), మౌనీ రాయ్ (మరియం), ముకేష్ రిషి (జియా-ఉల్-హక్), సూర్య శర్మ (కల్నల్ అష్ఫాక్ ఉల్లా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ ఆడియోలతో అందుబాటులో ఉంది. 5 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ కి IMDbలో 7.1/10 రేటింగ్ ఉంది. ఇది JioHotstarలో 2025 ఆగస్టు 8న రిలీజ్ అయింది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ రెండు టైమ్‌లైన్‌లలో తిరుగుతుంది. 1978 టైమ్‌లైన్‌లో, అధీర్ దయాళ్ ఒక యంగ్ R&AW ఏజెంట్‌గా, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కల్చరల్ అటాషేగా ఉండి, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ ప్రోగ్రామ్‌ని ఆపడానికి ఒక సీక్రెట్ మిషన్‌లో ఉంటాడు. భారత్ 1974లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత, పాకిస్తాన్ జనరల్ జియా కహుటా న్యూక్లియర్ ప్లాంట్‌లో రహస్యంగా బాంబ్ తయారు చేస్తుంటాడు. అధీర్, జియా దగ్గరకు చేరడానికి, జియా మనవడు అష్ఫాక్‌పై ఒక ఫేక్ కిడ్నాప్ డ్రామా క్రియేట్ చేసి, అతన్ని హీరోలా సేవ్ చేస్తాడు. దీనితో జియా అధీర్‌ని నమ్మి, తన ఇన్నర్ సర్కిల్‌లోకి తీసుకుంటాడు. అధీర్ తన స్నేహితురాలి జ్యోతి చతుర్వేది సహాయంతో, కహుటా ప్లాంట్ గురించి సమాచారం సేకరిస్తాడు. కానీ జియా టీమ్ జ్యోతిని హనీ-ట్రాప్‌లో ఇరికించి టార్చర్ చేస్తుంది. ఈకారణంగా ఆమె మరణిస్తుంది. అధీర్, డాక్టర్ కలాం లాంటి సైంటిస్ట్ సహాయంతో, కహుటా ప్లాంట్‌లో యాసిడ్ వాటర్ ఉపయోగించి సబోటాజ్ చేస్తాడు. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాన్‌ని 1978లో ఆపేస్తాడు.

Read Also : వయసు పెరగదు, కోరిక ఆగదు … ప్రేమించిన వాళ్లంతా కళ్ళముందే … ఇది మామూలు కథ కాదు

2025 టైమ్‌లైన్‌లో, అధీర్ దయాళ్ ఇప్పుడు భారత NSAగా ఉంటాడు. జియా మనవడు కల్నల్ అష్ఫాక్ ఉల్లా కహుటా ప్రాజెక్ట్‌ని రివైవ్ చేస్తున్నాడని తెలుస్తుంది. అష్ఫాక్, భారత్‌పై న్యూక్లియర్ అటాక్ ప్లాన్ చేస్తూ, ఒక రహస్య ఫైల్‌ని అబోటాబాద్‌లో అందుకుంటాడు. ఇక్కడ మరియం ఒక ఫిజిక్స్ టీచర్‌గా అండర్ కవర్‌లో ఉంటుంది. R&AW ఏజెంట్ శ్రీస్తి చతుర్వేది, అష్ఫాక్‌తో రొమాన్స్ చేస్తూ, అతని ప్లాన్స్ గురించి సమాచారం సేకరిస్తుంది. ఆమె స్పై-కెమెరా గ్లాసెస్‌తో కహుటా బ్లూప్రింట్‌ని ఫోటో తీసి R&AW చీఫ్ పరేష్ పరుల్కర్ కి పంపుతుంది. అష్ఫాక్, మరియం స్పై అని తెలుసుకుని, ఆమెను ఛేజ్ చేస్తాడు. అధీర్ NSAగా, మరియంని రక్షించడానికి పాకిస్తాన్‌కి వెళ్తాడు. ఇక క్లైమాక్స్ లో మరియంని అధీర్ కాపాడతాడా ? అష్ఫాక్‌ కుట్రలను అడ్డుకుంటాడా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : ఓనర్ ను కాపాడడానికి ప్రాణాలకు తెగించే పిల్లి… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఈ ఊళ్ళో నీళ్లలో అడుగుపెడితే పోతారు… తండ్రీకూతుర్లూ ఇద్దరూ ట్రాప్… వణుకు పుట్టించే ట్విస్టులు

OTT Movie : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

OTT Movie : డ్రాయర్ లో ఫిష్ వేసుకుని ఇదెక్కడి మెంటల్ పనిరా అయ్యా… ఒక్కో సీన్ మ్యాడ్ ఉంటది భయ్యా

OTT Movie : బాబోయ్ అరుపుతో అరసెకనులో చంపేసే అమ్మాయి… ఒక్కొక్కడూ ముక్కలు ముక్కలుగా… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

Big Stories

×