OTT Movie : కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చే హారర్ సినిమాలను ప్రేక్షకులందరూ ఇష్టపడతారు. రీసెంట్ గా మలయాళం నుంచి వచ్చిన ఒక హారర్ మూవీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. హీరోయిన్ తల్లి చనిపోయిన తరువాత ఆమె ఆత్మ ఇంటిలోనే తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్, హీరోని పెళ్లి చేసుకోవడం తల్లి ఆత్మకి ఇష్టం ఉండదు. అయినా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హర్రర్ కామెడీ మూవీ పేరు ‘హలో మమ్మి’ (Hello Mummy). 2024 లో విడుదలైన ఈ మలయాళ హర్రర్ కామెడీ మూవీకి వైశాఖ్ ఎలాన్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బోనీ, స్టెఫీని వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత అతనిని ఇష్టపడని ఆమె తల్లి ఆత్మ అతన్ని వెంటాడుతుంది. ఇందులో షరాఫుద్దీన్, ఐశ్వర్య లక్ష్మి, జగదీష్, జానీ ఆంటోనీ, సన్నీ హిందూజా నటించారు. ఈ మూవీ 21 నవంబర్ 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో బ్యాచిలర్ లైఫ్ ను సరదాగా గడుపుతుంటాడు. చిన్న చిన్న గొడవలు కూడా ఇంటికి వరకు తీసుకొస్తూ ఉంటాడు. ఇక వేరే దారి లేక ఇతనికి పెళ్లి చేయాలనుకుంటారు పేరెంట్స్. ఈ క్రమంలోనే హీరోయిన్ తో హీరోకి పెళ్లిచూపులు ఆరెంజ్ చేస్తారు. హీరోయిన్ ఒక సైంటిస్ట్ అవ్వాలని అనుకుంటుంది. హీరోకి మాత్రం గాలి తిరుగుల్లే ఉంటాయి. హీరోయిన్ ఒక కాఫీ షాప్ లో హీరోని కలుస్తుంది. ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికే వస్తాడు హీరో. అయితే హీరోయిన్ ను చూసి అభిప్రాయం మార్చుకుంటాడు. హీరోయిన్ కూడా అతని మాటలకు పడిపోతుంది. ఇలా వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అయితే హీరోయిన్, అతనికి ఒక కండిషన్ పెడుతుంది. హీరోని ఇల్లరికం రావాలని అడుగుతుంది. అంతేకాదు నా ఇంట్లో చనిపోయిన తన తల్లి ఆత్మ కూడా ఉందని చెప్తుంది. మొదట హీరో ఆ మాటలను సరిగ్గా పట్టించుకోడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి కూడా జరిగిపోతుంది. నిజానికి ఆ ఆత్మకి, హీరో అల్లుడుగా రావడం ఇష్టం ఉండదు. అందుకే అతన్ని మొదటి రాత్రి జరగకుండా అడ్డుపడుతూ ఉంటుంది. చివరికి హీరోయిన్ ఇంట్లో ఆత్మ ఎందుకు ఉంది? ఆత్మ వల్ల హీరో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? వీళ్లకు మొదటి రాత్రి జరుగుతుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హలో మమ్మి’ (Hello Mummy) అనే ఈ మూవీని చూడండి.