Gundeninda GudiGantalu Today episode march 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ఇంటికి వచ్చేస్తుంది. మనోజ్ పై మాట పడనివ్వదు. తిరిగి మళ్లీ మనోజ్ నే అంటుంది. దానికి మీనా ఇది మరీ బాగుంది మీ ఆయన చేసిన తప్పుకి మరి మా ఆయనను ఎందుకు అంటారు అని మీనా కూడా బాలుపై మాట పడనివ్వకుండా అరుస్తుంది.. పొయ్యి పార్కులో పడుకోవడం మా ఆయన ఇచ్చిన సంపాదనని వాడుకోవడం ఇవన్నీ ఏంటి మీ ఆయన మన డబ్బులు ఇస్తున్నాడా? ఇంటి ఖర్చులకోసం మా ఆయన డబ్బులు ఇస్తే దాన్ని మీ ఆయనకి ఇచ్చారు అది చూడలేదు అనుకుంటున్నారా అని ఇన్ డైరెక్టుగా ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది మీనా.. దాంతో మనోజ్ ఎలాగైన జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటాడు. మనోజు ఇంటర్వ్యూల కోసం చెప్పులరిగేలా ఆఫీసులో చుట్టూ తిరుగుతాడు. ఇంట్లో రోహిణి మనోజ్ కి జాబ్ వస్తుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు ప్రభావతి మీనా పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది కానీ మీనా ఎప్పటికప్పుడు ప్రభావతికి కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ కి ఉద్యోగం లేదని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో అడుగడికి అవమానమే ఎదురవుతుంది. మీనా బాలు ఇద్దరు కలిసి మనోజ్ రోహిణిలపై కారాల మిరియాలు నూరుతుంటారు. రోహిణి వాళ్ళ భర్త జాబ్ లేకుండా ఇన్నాళ్లు పార్కులో పల్లీలు తింటూ బతకాడంటూ మీనా ఎత్తిపొడుస్తుంది.. మనోజ్ మొత్తానికి ఉద్యోగానికి బయటకు వెళ్తాడు. రెండు మూడు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఈ ఉద్యోగం వద్దు ఏమి వద్దు దీనికన్నా ప్రశాంతంగా ఎక్కడ చోటు పడుకోవడం మేలని అనుకుంటాడు. మళ్లీ రోహిణి అన్నమాట గుర్తు చేసుకొని ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తాడు.
అలా తాను సెలెక్ట్ అయిన పాత ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ లేడీ బాస్ ఉండడం చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె గతంలో ఓసారి ఇంటర్వ్యూ కి వచ్చావు లేడీ బాస్ దగ్గర పని చేయను లేడి మేనేజర్ చెప్పింది నేను వినను అని చాలా మాటలు అన్నావ్ ఇప్పుడు నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు మా మాటలు వినడమేంటి ఇక్కడున్న వాళ్ళందరిని మార్చేస్తావని అంటుంది. తనకి మనోజ్ ఎంతగా బతిమిలాడినా కూడా ఆమె ససేమీరా అంటుంది. ఒకప్పుడు నాకు ఉద్యోగం లేదు ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను నన్ను క్షమించండి మేడం అని మనోజు కాళ్ల వెళ్ళబడి అడుగుతాడు..
రోహిణి ప్రభావతి ఇద్దరూ మీనా దగ్గరికి వెళ్తారు. మీనాను పిలిచి బాలుని కంట్రోల్లో పెట్టు అని అంటారు. మీ అబ్బాయిని మీరే కంట్రోల్లో పెట్ట లేకపోతే నేనెలా పెడతానో అత్తయ్య అనేసి మీనా ప్రభావతి పై సెటైర్లు వేస్తుంది. మీనాకు నోరు ఎక్కువైంది అందుకు అటు రోహిణి కూడా ప్రభావతికి చాడీలు చెప్తుంది. నా నోరేం ఎక్కువైంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అప్పుడు ఎంత తింటున్నానో ఇప్పుడు కూడా అంతే తింటున్నాను అని రోహిణి కౌంటర్లు ఇస్తుంది. నా పని అంతా అయిపోయింది నేను వెళ్లి నా పని నేను చేసుకోవాలి పూలకొట్టును చూసుకోవాలి అంటుంది.. దానికి ప్రభావతి అబ్బో అదొక పెద్ద బిజినెస్ దానికోసం మీరు కష్టపడి ఎక్కడికి వెళ్లి కూర్చొని పూలు అమ్ముకోవాలి పూలమ్మితే మహా అయితే 1000 కూడా రావు అలాంటిది నువ్వు మాట్లాడుతున్నావ్ అని మీనా పై ప్రభావతి కౌంటర్ ఇస్తుంది.
ఆ మాట వినగానే కోప్పడ్డ మీనా.. నాకేమన్నా లక్షలు పెట్టే అత్తగారు ఉన్నారా. ఎవరికి తెలియకుండా లక్షలు ఇచ్చి బిజినెస్ చేసుకోమని అన్నారా లేదు కదా మా ఆయన సంపాదనతోనే నేను ఏదో పూల కొట్టు పెట్టుకొని సంపాదిస్తున్నాను నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టే నిజాయితీగానే మాట్లాడతానని మీనా అరుస్తుంది. దానికి ప్రభావతి ఏంటే ఇంత పొగరుగా మాట్లాడుతున్నావ్ అంటే నేను ఏమన్నా మీ అబ్బాయి లాగా ఉద్యోగం లేకుండా పార్కులో తిరుగుతున్నానా ఇంట్లో పని అయింది నా పని టిప్పితిప్పి మనోజ్ దగ్గరకే టాపిక్ ని తీసుకొస్తుంది. ప్రభావతి మాత్రం నోరు అదుపులో పెట్టుకోకు అంటే ఇంట్లో కూడా ఉండలేవు అని వార్నింగ్ ఇస్తుంది
ఇక మీనా కూడా ఈ ఇంట్లో మేమేం తప్పు చేయలేదు కదా పార్కులో వెళ్లి పడుకున్నామా లేక ఖాళీగా పల్లీలు తిన్నామా అలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తారు మా తప్పేంటి అనేసి మీనా అడుగుతుంది. ప్రభావతి ఏం మాట్లాడిన కూడా మీనా దానికి వరుసగా సెటిల్ వేయడంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది. అటు రోహిణి కూడా చూశారా ఆంటీ మీనా ఎంత పొగరుగా మాట్లాడుతుందో మనోజ్ కి జాబ్ రానివ్వండి ఆ తర్వాత వీళ్ళందరూ సంగతి నేను చెప్తాను అనేసి వెళ్ళిపోతుంది. మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్లిన తర్వాత ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో మనోజ్ కి ఉద్యోగం వస్తుందా? రాదా? అన్నది తెలియాల్సి ఉంది..