Gold Duty Free: ప్రముఖ సినీ నటి రన్యా రావును ఇటీవల బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆమె నుంచి ఏకంగా 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ మార్కెట్లో రూ. 12.56 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఘటన తర్వాత అసలు దుబాయ్ నుంచి భారతదేశానికి ఎంత బంగారం తీసుకురావచ్చనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంత పరిమాణం వరకు అనుమతి ఉంది. రూల్స్ ఏం చెబుతున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం అసలు విలువతో పాటు, దానిపై పన్ను కూడా విధించబడుతుంది. ఈ కారణంగా బంగారం ధర మరింత పెరుగుతుంది. కానీ దుబాయ్‌లో బంగారంపై ఎలాంటి పన్ను లేదు. అందుకే అనేక మంది దుబాయ్ నుంచి అక్రమ మార్గంలో ఇండియాకు గోల్డ్ తీసుకొచ్చి దొరికిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ దీనిపై పరిమితి ఉంది.
మార్చి 7న దుబాయ్‌లో బంగారం ధర 10 గ్రాములకు 3,260 AED (UAE దిర్హామ్). ఇండియా రూపాయల్లో చెప్పాలంటే ఇది రూ.77,281.46. ఇదే సమయంలో ముంబైలో 10 గ్రాములకు గోల్డ్ రూ. 87,480గా ఉంది. అంటే దుబాయ్ బంగారం ధర కంటే ఇండియాలో దాదాపు 11.58 శాతం ఎక్కువ.
Read Also: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ మళ్లీ ప్రారంభం.. వీటిపై బంపర్ ఆఫర్స్..
విదేశాల నుంచి భారతదేశానికి బంగారాన్ని తీసుకురావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులు, కస్టమ్ సుంకం నియమాలు తప్పక పాటించాలి. ఈ క్రమంలోనే భారతదేశంలోకి విదేశాల నుంచి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.
15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా 40 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా తీసుకురావచ్చు. కానీ దీని కోసం వారు సంబంధిత రుజువు చూపించాల్సి ఉంటుంది.
20 గ్రాముల వరకు బంగారు నాణేలపై కస్టమ్ సుంకం ఉండదు
20 నుంచి 100 గ్రాముల బరువున్న బంగారు నాణేలపై 10% కస్టమ్ డ్యూటీ వర్తిస్తుంది
100 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారు నాణేలపై కూడా 10% కస్టమ్ డ్యూటీ చెల్లించాలి
ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉంటున్న భారత పౌరులు (PIOలు) రాయితీ కస్టమ్స్ సుంకంతో బంగారాన్ని తీసుకురావచ్చు. వీరికి వర్తించే నియమాలు క్రింది విధంగా ఉంటాయి.