E-Paper
Advertisement

ఆన్‌లైన్‌లో అజ్ఞాత ప్రేమికుడు… కట్ చేస్తే కాలేజీ సూపర్ స్టార్… ఓటీటీలో ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ కామెడీ

ఆన్‌లైన్‌లో అజ్ఞాత ప్రేమికుడు… కట్ చేస్తే కాలేజీ సూపర్ స్టార్… ఓటీటీలో ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ కామెడీ
Advertisement

A Cinderella Story on OTT: చిన్నప్పుడు మనం విన్న సిండ్రెల్లా కథ గుర్తుందా? సవతి తల్లి వేధింపులు భరిస్తూ, ఓ అందమైన యువరాజు కోసం ఎదురుచూసే అమ్మాయి కథ అది. కానీ అదే కథను ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చి, యువతకు నచ్చే ప్రేమకథగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రయత్నమే 2004లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎ సిండ్రెల్లా స్టోరీ’ (A Cinderella Story). హిలరీ డఫ్, చాడ్ మైఖేల్ ముర్రే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆన్‌లైన్ పరిచయం, హాలోవీన్ పార్టీ, మిస్సయిన సెల్‌ఫోన్ చుట్టూ సాగే ఈ ప్రేమకథ ఇప్పడు వరకు రెంట్ కు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఈ రోజు నుంచి ఆ అవసరం లేకుండానే చూసేయచ్చు.

కథలోకి వెళ్తే…

సామ్ మాంట్‌గోమెరీ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతుంది. దీంతో తన సవతి తల్లి ఫియోనా, ఇద్దరు సవతి సోదరీమణుల వేధింపుల మధ్య జీవితం సాగిస్తుంది. తండ్రి ఎంతో ఇష్టంగా నడిపిన డైనర్‌లోనే పనిచేస్తూ, చదువును కొనసాగిస్తుంది. ఇంట్లో తనకు ఎదురయ్యే అవమానాలు, బాధలను మర్చిపోవడానికి ‘నోమాడ్’ అనే పేరుతో ఆన్‌లైన్‌లో ఓ అబ్బాయితో చాటింగ్ చేస్తుంటుంది. అతడితో మాట్లాడుతున్న కొద్దీ సామ్ మనసులో ప్రేమ చిగురిస్తుంది.

Advertisement

మరోవైపు ఆస్టిన్ ఏమ్స్ అదే స్కూల్‌లో చదువుతున్న ఫుట్‌బాల్ స్టార్. అందరికీ కలల రాకుమారుడిలా కనిపించే అతడికి కూడా తన జీవితంపై కొన్ని అసంతృప్తులు ఉంటాయి. తండ్రి ఆశలు, తనకంటూ ఉన్న కలల మధ్య అతడు సతమతమవుతుంటాడు. నిజానికి ఆన్‌లైన్‌లో సామ్‌తో మాట్లాడుతున్నది ఆస్టినే. ఇద్దరూ హాలోవీన్ డ్యాన్స్ పార్టీలో కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు.

ముసుగు ధరించి పార్టీకి వచ్చిన సామ్‌ను చూసి ఆస్టిన్ ఆకర్షితుడవుతాడు. అయితే తన అసలు గుర్తింపు తెలిస్తే అతడు తనను ఇష్టపడకపోవచ్చనే భయంతో సామ్ అర్ధరాత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో తన సెల్‌ఫోన్‌ను అక్కడే మర్చిపోతుంది. సిండ్రెల్లా కథలో గాజు చెప్పు ఎలాగైతే యువరాజును అమ్మాయి దగ్గరకు చేర్చిందో, ఈ కథలో సెల్‌ఫోన్ అదే పని చేస్తుంది. ఆ ఫోన్ ఆధారంగా తన ఆన్‌లైన్ ప్రేయసిని వెతకడం మొదలుపెడతాడు ఆస్టిన్. మరి సామ్ అసలు గుర్తింపు అతడికి తెలుస్తుందా? సవతి తల్లి పెట్టే అడ్డంకులను దాటుకుని తన కలలను నిజం చేసుకుంటుందా? చివరకు ఈ ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరుతుందనేదే మిగతా సినిమా.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Advertisement

‘ఎ సిండ్రెల్లా స్టోరీ’ (A Cinderella Story)లో సామ్ మాంట్‌గోమెరీగా హిలరీ డఫ్ (Hilary Duff), ఆస్టిన్ ఏమ్స్‌గా చాడ్ మైఖేల్ ముర్రే (Chad Michael Murray), ఫియోనాగా జెన్నిఫర్ కూలిడ్జ్ (Jennifer Coolidge) నటించారు. మార్క్ రోస్మన్ (Mark Rosman) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004 జూలై 16న థియేటర్లలో విడుదలైంది. సుమారు 95 నిమిషాల నిడివి ఉన్న ఈ రొమాంటిక్ కామెడీ ఇప్పటివరకు భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple TV) ప్లాట్‌ఫామ్‌లలో కేవలం అద్దెకు (Rent) మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఈ రోజు (నవంబర్ 19) నుండి ఇది ఎటువంటి అదనపు రుసుము లేకుండా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లందరికీ నేరుగా స్ట్రీమింగ్ చేయడానికి అందుబాటులోకి వచ్చింది.

Read Also: బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్

Tags

Related News

తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్

మాయా లోకంలో మహా సంగ్రామం… శాపాన్ని ఛేదించడానికి యోధుల సాహస యాత్ర… ఫాంటసీ ప్రియులకు అసలైన విందు

నగరాన్ని వణికించే హంతకుడు… పోలీసులకు నిద్రలేని రాత్రులు… వెన్నులో వణుకు పుట్టించే సిరీస్

కాలేజీ క్యాంపస్‌లో మళ్లీ మొదలైన రచ్చ… ప్రేమ, స్నేహం, రాజకీయాలతో అదిరిపోయే సీజన్ 2… ఉచితంగా స్ట్రీమింగ్

బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్

ఇంటి తలుపు తట్టిన పోలీసులు.. తలకిందులైన భార్య జీవితం.. దిమాక్ కరాబ్ చేసే క్రైమ్ థ్రిల్లర్

ఆటతో ప్రపంచాన్ని శాసించిన దిగ్గజం… నికోలస్ కేజ్ నట విశ్వరూపం… పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బయోపిక్

Big Stories

Advertisement
×