E-Paper
Advertisement

తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్

తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్
Advertisement

Filipino Action Comedy : సాధారణంగా తండ్రీకొడుకుల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని తండ్రీకొడుకులు, అనుకోకుండా ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ ముఠా చేతిలో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ, హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్ కలగలిసిన సరికొత్త ఫిలిపినో చిత్రం ‘హెచ్‌బీ2మీ’ (HB2Me) ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఎలిజా కాన్లాస్, జాన్ ఆర్సిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ ఏ ఓటీటీలోకి రాబోతోంది? అసలు ఆ పుట్టినరోజు నాడు జరిగిన రచ్చ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళ్తే…

డెల్ (జాన్ ఆర్సిల్లా) తన కొడుకు జాన్ (ఎలిజా కాన్లాస్) పుట్టినరోజు సందర్భంగా ఏటా ఏదో ఒక ప్రాంక్ చేస్తుంటాడు. తండ్రి చేసే ఈ పనులతో విసిగిపోయిన జాన్, ఈసారి అతడికే గట్టి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. తన పుట్టినరోజున తండ్రిని కిడ్నాప్ చేసినట్లు ఓ నాటకం ఆడాలని ప్లాన్ వేస్తాడు. అయితే అతడు వేసిన ఈ ప్లాన్ ఊహించని మలుపు తిరుగుతుంది. సరదాగా మొదలైన నకిలీ కిడ్నాప్ వ్యవహారంలోకి నిజమైన నేరస్థులు ప్రవేశిస్తారు. దీంతో డెల్ నిజంగానే కిడ్నాపర్ల చేతిలో చిక్కుకుంటాడు.

Advertisement

తండ్రిని కాపాడుకోవడానికి జాన్ నానా తంటాలు పడాల్సి వస్తుంది. మరోవైపు నేరస్థుల నుంచి తప్పించుకోవడానికి డెల్ కూడా తనదైన ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగే గందరగోళం, ఛేజింగ్‌లు, ఫైట్లు నవ్వులు పూయిస్తాయి. ఇన్నాళ్లూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవపడిన తండ్రీకొడుకులు, ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఎలా ఒక్కటయ్యారు? తండ్రిని కాపాడేందుకు జాన్ ఏం చేశాడు? ఈ ప్రమాదం నుంచి ఇద్దరూ క్షేమంగా బయటపడగలిగారా? అనేదే ఈ సినిమా కథ. కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ ని చూడాలనుకుంటే ఈ మూవీని చూసేయండి.

 తెలుగులో ఉందా ?

‘హెచ్‌బీ2మీ’ (HB2Me) సినిమాలో డెల్ పాత్రలో జాన్ ఆర్సిల్లా (John Arcilla), అతడి కొడుకు జాన్‌గా ఎలిజా కాన్లాస్ (Elijah Canlas) నటించారు. వీరితో పాటు కార్మీ మార్టిన్ (Carmi Martin), దిండో అర్రోయో (Dindo Arroyo), అలెక్సా మిరో (Alexa Miro), క్రిజా తా (Criza Taa), ఆర్చీ అలెమానియా (Archie Alemania), మాట్ లోజానో (Matt Lozano) తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. వెరోనికా వెలాస్కో (Veronica Velasco) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సుమారు 1 గంట 48 నిమిషాల నిడివి ఉన్న ఈ ఫిలిపినో యాక్షన్ కామెడీ 2026 ఆగస్టు 19 న ఫిలిప్పీన్స్ దేశంలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. 2026 నవంబర్ 19 నుంచి Netflixలో ఒరిజినల్ ఫిలిపినో ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

Advertisement

Read Also: ఆఫీసులో భార్యాభర్తల సీక్రెట్ ఆట… దొరికితే ఉద్యోగాలు ఫసక్… హాట్‌స్టార్‌లో నవ్వుల జాతర

Tags

Related News

మాయా లోకంలో మహా సంగ్రామం… శాపాన్ని ఛేదించడానికి యోధుల సాహస యాత్ర… ఫాంటసీ ప్రియులకు అసలైన విందు

నగరాన్ని వణికించే హంతకుడు… పోలీసులకు నిద్రలేని రాత్రులు… వెన్నులో వణుకు పుట్టించే సిరీస్

కాలేజీ క్యాంపస్‌లో మళ్లీ మొదలైన రచ్చ… ప్రేమ, స్నేహం, రాజకీయాలతో అదిరిపోయే సీజన్ 2… ఉచితంగా స్ట్రీమింగ్

బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్

ఇంటి తలుపు తట్టిన పోలీసులు.. తలకిందులైన భార్య జీవితం.. దిమాక్ కరాబ్ చేసే క్రైమ్ థ్రిల్లర్

ఆటతో ప్రపంచాన్ని శాసించిన దిగ్గజం… నికోలస్ కేజ్ నట విశ్వరూపం… పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బయోపిక్

స్టార్ హీరోకు లేడీ బాడీగార్డ్… ప్రాణాలు కాపాడుతూనే ప్రేమలో పడిపోయిన క్యూట్ లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×