E-Paper
Advertisement

మాయా లోకంలో మహా సంగ్రామం… శాపాన్ని ఛేదించడానికి యోధుల సాహస యాత్ర… ఫాంటసీ ప్రియులకు అసలైన విందు

మాయా లోకంలో మహా సంగ్రామం… శాపాన్ని ఛేదించడానికి యోధుల సాహస యాత్ర… ఫాంటసీ ప్రియులకు అసలైన విందు
Advertisement

Fantasy Adventure Series: పురాణ గాథలు, దేవతల శక్తులు, మాయా రాక్షసులతో కూడిన ఫాంటసీ ప్రపంచానికి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతోమంది అభిమానులున్నారు. అలాంటి ప్రేక్షకులను ఆకట్టుకున్న పాపులర్ అడ్వెంచర్ సిరీస్ ‘పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్’ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి పెర్సీ ముందున్న సవాళ్లు మరింత ప్రమాదకరంగా ఉండబోతున్నాయి. ప్రాణ స్నేహితురాలు అన్నాబెత్‌ను కాపాడటంతో పాటు, ఒలింపస్‌ను నాశనం చేయాలని చూస్తున్న టైటాన్ల కుట్రలను కూడా అతడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రిక్ రియోర్డాన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘ది టైటాన్స్ కర్స్’ ఆధారంగా రూపొందిన ‘పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ సీజన్ 3’ (Percy Jackson and the Olympians Season 3) నవంబర్ 20 నుంచి ఓటీటీలోకి రానుంది. మరి ఈ కొత్త సీజన్ కథలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

సముద్ర దేవుడు పోసిడాన్ కుమారుడైన పెర్సీ జాక్సన్ మరో ప్రమాదకరమైన సాహసానికి సిద్ధమవుతాడు. ఈసారి థాలియా, గ్రోవర్‌లతో కలిసి మైనేలోని వెస్ట్‌ఓవర్ హాల్ అనే పాఠశాల నుంచి నికో, బియాంకా డి ఏంజెలో అనే ఇద్దరు అర్థదేవతలను రక్షించేందుకు బయలుదేరతాడు. అయితే ఈ మిషన్‌లో అనుకోని ప్రమాదం ఎదురవుతుంది. మాంటికోర్ అనే భయంకరమైన రాక్షసుడి కారణంగా అన్నాబెత్ అదృశ్యమవుతుంది. మరోవైపు వేట దేవత ఆర్టెమిస్ కూడా ప్రమాదంలో చిక్కుకుంటుంది.

Advertisement

తన ప్రాణ స్నేహితురాలిని ఎలాగైనా కాపాడుకోవాలని పెర్సీ నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం గ్రోవర్, థాలియాతో కలిసి ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో క్రోనోస్ సైన్యం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడంతో పాటు, దేవతలను బంధించిన అట్లాస్ కుట్రలను కూడా అడ్డుకోవాల్సి వస్తుంది. మరోవైపు నికో, బియాంకాల అసలు నేపథ్యం బయటపడటంతో వారి చుట్టూ కూడా ప్రమాదం ముసురుకుంటుంది.

ఇక ఒలింపస్ భవిష్యత్తును నిర్ణయించబోయే గొప్ప జోస్యం పెర్సీని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ముగ్గురు ప్రధాన దేవుళ్లైన జ్యూస్, పోసిడాన్, హేడిస్‌ల సంతానంలో ఒకరి చేతిలోనే ఒలింపస్ భవిష్యత్తు ఉంటుందని ఆ జోస్యం చెబుతుంది. ఆ వ్యక్తి దేవతల లోకాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు లేదా పూర్తిగా నాశనం చేయవచ్చు. ఇంతకీ ఆ జోస్యం ఎవరిని సూచిస్తోంది? అన్నాబెత్‌ను పెర్సీ కాపాడగలడా? ఆర్టెమిస్‌ను విడిపించి టైటాన్ల కుట్రలను అడ్డుకోగలడా? అనేదే ఈ సీజన్‌లో ఆసక్తికరంగా సాగనుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

Advertisement

ఈ సిరీస్‌లో పెర్సీ జాక్సన్‌గా వాకర్ స్కోబెల్ (Walker Scobell), అన్నాబెత్‌గా లియా జెఫ్రీస్ (Leah Sava Jeffries), గ్రోవర్‌గా ఆర్యన్ సిమ్హాద్రి (Aryan Simhadri), థాలియాగా తమరా స్మార్ట్ (Tamara Smart) నటిస్తున్నారు. నికో పాత్రలో లెవి క్రిసోపులోస్ (Levi Chrisopulos), బియాంకాగా ఆలివ్ అబెర్‌క్రాంబీ (Olive Abercrombie), ఆర్టెమిస్‌గా డాఫ్నే కీన్ (Dafne Keen) కనిపించనున్నారు. ఈ సిరీస్ మూడో సీజన్‌ మొత్తం 8 ఎపిసోడ్‌లతో 2026 నవంబర్ 20 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది. తొలి రోజు రెండు ఎపిసోడ్‌లు విడుదలై, ఆ తర్వాత ప్రతి వారం రెండు ఎపిసోడ్‌ల చొప్పున అందుబాటులోకి రానున్నాయి.

Read Also: బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్

Tags

Related News

నగరాన్ని వణికించే హంతకుడు… పోలీసులకు నిద్రలేని రాత్రులు… వెన్నులో వణుకు పుట్టించే సిరీస్

కాలేజీ క్యాంపస్‌లో మళ్లీ మొదలైన రచ్చ… ప్రేమ, స్నేహం, రాజకీయాలతో అదిరిపోయే సీజన్ 2… ఉచితంగా స్ట్రీమింగ్

బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్

ఇంటి తలుపు తట్టిన పోలీసులు.. తలకిందులైన భార్య జీవితం.. దిమాక్ కరాబ్ చేసే క్రైమ్ థ్రిల్లర్

ఆటతో ప్రపంచాన్ని శాసించిన దిగ్గజం… నికోలస్ కేజ్ నట విశ్వరూపం… పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బయోపిక్

స్టార్ హీరోకు లేడీ బాడీగార్డ్… ప్రాణాలు కాపాడుతూనే ప్రేమలో పడిపోయిన క్యూట్ లవ్ స్టోరీ

పదేళ్ల భర్త చిత్రహింసలకు ఎండ్ కార్డ్… ఫస్ట్ లవ్‌తో సెకండ్ ఇన్నింగ్స్… హృదయాన్ని కదిలించే సినిమా

Big Stories

Advertisement
×