BigTV English

War2 Movie: ‘వార్ 2’ మూవీ డ్యాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కి తీవ్ర గాయాలు..

War2 Movie: ‘వార్ 2’ మూవీ డ్యాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కి తీవ్ర గాయాలు..

War2 Movie: టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో దేవర మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ షూటింగ్ దశలో బిజీగా ఉంది. ఈ సమ్మర్ కు మూవీని రిలీజ్ చెయ్యనున్నాడు. అందుకే ఈ మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. బాలీవుడ్ ఎన్టీఆర్ తొలిసారి చెయ్యబోతున్న మూవీ కావడంతో అటు బాలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఫ్యాన్స్ ఆత్రుగా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ చేస్తునం సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ దేశం లో ఎంతో గర్వించదగ్గ టాప్ డ్యాన్సర్స్.. నువ్వా నేనా అంటూ పోటీ పడి డ్యాన్స్ వేస్తున్నారు. నాటు నాటు రేంజ్ లో ఇందులో సాంగ్ ను డిజైన్ చేశారని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ మూవీలో ఓ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హృతిక్ రోషన్ కు గాయాలు తగిలినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


వీరిద్దరి కాంబినేషన్ లో సీన్స్ తో పాటుగా డ్యాన్స్ ను ఉంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సాంగ్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే హృతిక్ రోషన్ కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయట. దీంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హృతిక్ రోషన్ ఇది వరకు యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు గాయాలు అయ్యాయి. కానీ మొట్టమొదటిసారి ఆయనకు డ్యాన్స్ రిహార్సల్స్ లో గాయం అవ్వడం ఇదే మొదటిసారి.. అంటే ఈ డ్యాన్స్ స్టెప్స్ ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్లు వారం రోజుల పాటు హృతిక్ రోషన్ ని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారట. దీంతో డ్యాన్స్ రిహార్సల్స్ మధ్యలోనే ఆగిపోయింది. యష్ రాజ్ స్టూడియోస్ ఆవరణలో ఈ పాట చిత్రీకరణ కోసం ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సెట్ లోనే రిహార్సల్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.

Also Read :మరోసారి కొత్త బాయ్ ఫ్రెండ్ తో దొరికిన సమంత.. ఇదిగో ప్రూఫ్..


ఈ సాంగ్ పూర్తి అయ్యిన వెంటనే ఇద్దరి హీరోల మధ్య పెద్ద ఫైటింగ్ సీన్ ఉందని సమాచారం.. అదే క్లైమాక్స్ సీన్ అని సమాచారం. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి భాగం మనం చూసింది కేవలం టీజర్ మాత్రమేనట. రెండవ భాగానికి ఫ్యూజులు అవుట్ అయ్యే రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్.. నార్త్, సౌత్ లో సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎన్ని బద్దలు అవుతాయో ఊహించుకోవచ్చు.. ఈ రేంజ్ లో హైఫ్ క్రియేట్ అవ్వడంతో ఫ్యాన్స్ రోజు రోజుకు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాగా వేస్తాడని తెలుస్తుంది. సమ్మర్ కానుకగా మూవీ రిలీజ్ కాబోతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×