E-Paper
Advertisement

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్
Advertisement

Sci-Fi Survival Adventure Movie: ఒక్కసారిగా ఓ కాలనీ మొత్తం కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? నిన్నటి వరకు మనుషులు తిరిగిన రోడ్లపై భారీ డైనోసార్లు సంచరిస్తే ? తమ ఇళ్లతో సహా ఓ చిన్న అమెరికన్ కాలనీ ఏకంగా డైనోసార్ల యుగంలో చిక్కుకుపోతే అక్కడి ప్రజలు ఎలా బతుకుతారు ? అసలు ఈ వింత మార్పు ఎందుకు జరిగింది ? తిరిగి తమ కాలానికి చేరుకునే అవకాశం ఉంటుందా ? ఇలాంటి ఆసక్తికరమైన ఆలోచనతో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ అడ్వెంచర్ మూవీ ‘ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’ (The End of Oak Street). మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే ?

కథలోకి వెళ్తే…

కథ 1982 నాటి అమెరికాలోని ఓ కాలనీలో మొదలవుతుంది. ఓక్ స్ట్రీట్‌లో ప్లాట్ కుటుంబం కూడా అందరిలాగే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటుంది. ఇళ్లు, రోడ్లు, చుట్టుపక్కల పరిసరాలు… అంతా మామూలుగానే కనిపిస్తాయి. కానీ ఒక రోజు ఊహించని పరిణామం ఆ ప్రాంతం రూపురేఖలనే మార్చేస్తుంది. ఓక్ స్ట్రీట్ ప్రాంతంలో అకస్మాత్తుగా ఓ వింతైన కాస్మిక్ అనామలీ ఏర్పడుతుంది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే అక్కడి కాలం, చుట్టూ ఉన్న రియాలిటీ అన్నీ అసాధారణంగా మారిపోతాయి. కొద్దిసేపటి క్రితం ఉన్న ప్రపంచం కనిపించకుండా పోయి, ఆ ప్రాంతం పూర్తిగా అపరిచితమైన వాతావరణంలోకి వెళ్లిపోతుంది.

Advertisement

అక్కడితో అసలు స్టోరీ మొదలవుతుంది. 1982లో ఉన్న ఓక్ స్ట్రీట్ కాలనీ కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్లి డైనోసార్లు సంచరించిన ప్రాచీన ప్రపంచంలోకి చేరుతుంది. తమ ఇళ్లతో పాటు మొత్తం కాలనీనే మరో యుగంలోకి వచ్చేసిందని తెలుసుకున్న కుటుంబాలకు మొదట ఏం చేయాలో అర్థం కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించే కొద్దీ ప్రమాదం ఎంత పెద్దదో తెలుస్తుంది. ఎక్కడ చూసినా మనుషులకు తెలియని జీవులు, భారీ డైనోసార్లు, ప్రమాదకరమైన అడవి వాతావరణం. ఇలాంటి ప్రపంచంలో ఆధునిక సౌకర్యాలు ఉన్నా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. ఆహారం, నీరు, రక్షణ కోసం ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలకే ప్రమాదం.

ఈ పరిస్థితుల్లో ప్లాట్ కుటుంబం ఒకరినొకరు కాపాడుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుంది. అసలు ఈ కాస్మిక్ అనామలీ ఎందుకు ఏర్పడింది ? ఓక్ స్ట్రీట్ మాత్రమే ఎందుకు ఈ మార్పుకు గురైంది ? తిరిగి 1982లోకి వెళ్లే మార్గం ఉందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ వారి సర్వైవల్ జర్నీ మొదలవుతుంది. డైనోసార్లతో పోరాటం మాత్రమే కాకుండా, తమ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవడం, తెలియని ప్రపంచంలో దారి కనుక్కోవడం, తిరిగి ఇంటికి చేరే అవకాశం కోసం ప్రయత్నించడం కథలో ఉత్కంఠను పెంచుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

Advertisement

‘ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో ఇంగ్లీష్ భాషలో మాత్రమే చూడొచ్చు. థియేటర్లలో తెలుగు వెర్షన్ ఉన్నప్పటికీ, ప్రైమ్ వీడియో స్టోర్‌లో తెలుగు ఆడియో ఇంకా అందుబాటులోకి రాలేదు. రెంట్ కి తీసుకున్న తర్వాత సినిమా ప్రారంభించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి ప్లే చేసిన తర్వాత 48 గంటల్లోగా చూడటం పూర్తి చేయాలి. డైనోసార్లు, టైమ్ ట్రావెల్, సర్వైవల్ అడ్వెంచర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక ఆసక్తికరమైన ఛాయిస్.

Read Also: రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

Related News

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

Big Stories

Advertisement
×