E-Paper
Advertisement

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ
Advertisement

Romantic Comedy: ఒక్క రాత్రిలో కలిసిన అమ్మాయి మీద ప్రేమ పుడితే… ఆమె ఫోన్ నంబర్‌లో ఒక్క అంకె మిస్ అయితే ? ఆ ఒక్క తప్పు నంబర్‌ను సరిచేసుకునేందుకు ఓ యువకుడు యూనివర్సిటీలోని ప్రతి అమ్మాయిలో తన ప్రేయసిని వెతకడం మొదలుపెడితే ? అసలు తాను ప్రేమించిన అమ్మాయి దొరుకుతుందా ? లేక ఆమె కోసం మొదలుపెట్టిన వెతుకులాటలోనే ఊహించని ప్రేమ పుడుతుందా ? ఇలాంటి సరదా గందరగోళం, ప్రేమ, కాలేజ్ లైఫ్‌తో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఫైండింగ్ ఎమిలీ’ (Finding Emily). మరి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

కథలోకి వెళ్తే…

మాంచెస్టర్ సిటీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ బార్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పని చేస్తాడు ఓవెన్. అతని జీవితం ఓ రాత్రి ఊహించని మలుపు తిరుగుతుంది. ఓ పార్టీలో అతనికి ఎమిలీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మొదటి పరిచయంలోనే ఇద్దరి మధ్య మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. ఓవెన్‌కి మాత్రం అది సాధారణ పరిచయం కాదు. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు. వెళ్లిపోయే ముందు ఎమిలీ తన పేరు చెప్పి ఫోన్ నంబర్ కూడా ఇస్తుంది.

Advertisement

మరుసటి రోజు ఆమెకు మెసేజ్ చేయడానికి ప్రయత్నించిన ఓవెన్‌కు అసలు సమస్య తెలుస్తుంది. ఫోన్ నంబర్‌లో ఒక అంకె తక్కువగా ఉంది. ఆమె ఇంటిపేరు ఏంటో తెలియదు. ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇతర వివరాలు కూడా లేవు. అంటే తనకు తెలిసిన ఏకైక ఆధారం… ‘ఎమిలీ’ అనే పేరు, తప్పుగా ఉన్న ఫోన్ నంబర్ మాత్రమే. అయినా ఓవెన్ వెనక్కి తగ్గడు. తన డ్రీమ్ గర్ల్‌ను ఎలాగైనా కనిపెట్టాలనే పట్టుదలతో యూనివర్సిటీ డైరెక్టరీని ఆశ్రయిస్తాడు. “ఎమిలీ” పేరుతో ఉన్న విద్యార్థులందరికీ ఒకేసారి మెయిల్ పంపేస్తాడు.

దీంతో అతని ప్రేమ ప్రయత్నం కాస్తా క్యాంపస్‌లో పెద్ద గందరగోళంగా మారుతుంది. ఈ క్రమంలో అతనికి ఎమిలీ రైన్ అనే అమెరికన్ సైకాలజీ విద్యార్థిని పరిచయం అవుతుంది. ఎమిలీ రైన్‌కు ప్రేమ, రొమాన్స్‌పై పెద్దగా నమ్మకం ఉండదు. కానీ ఓవెన్ తన మొదటి ప్రేమను వెతుక్కుంటూ పడుతున్న తపన ఆమెను ఆకట్టుకుంటుంది. అంతేకాదు, తన సైకాలజీ డిసర్టేషన్ కోసం ఓవెన్‌ను కేస్ స్టడీగా ఉపయోగించుకోవచ్చని భావిస్తుంది. దీంతో అతనికి అసలు ఎమిలీని వెతికిపెట్టేందుకు సహాయం చేయడానికి అంగీకరిస్తుంది.

Advertisement

ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ వెతుకులాట క్రమంగా యూనివర్సిటీ మొత్తానికి తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో చర్చ మొదలవుతుంది. కాలేజ్ ఈమెయిల్ వ్యవహారం బయటకు రావడంతో ఓవెన్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తారు. కానీ అసలు కథ అక్కడే మారుతుంది. తన డ్రీమ్ గర్ల్‌ను వెతుకుతున్న ఓవెన్‌కు ఎమిలీ రైన్‌తో గడిపే సమయం పెరుగుతుంది. మొదట కేస్ స్టడీగా చూసిన ఆమెతోనే అతనికి ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. అసలు ఓవెన్ మొదటి రాత్రి కలిసిన ఎమిలీని కనుగొంటాడా ? లేక తాను వెతుకుతున్న ప్రేమ తన పక్కనే ఉందని తెలుసుకుంటాడా ? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా మిగతా కథ.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘ఫైండింగ్ ఎమిలీ’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనే చూడాల్సి ఉంటుంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. కాలేజ్ లైఫ్, ఫస్ట్ లవ్, రొమాంటిక్ కామెడీతో పాటు కొంచెం లైట్ హార్ట్‌డ్ గందరగోళం ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి టైమ్‌పాస్‌గా ఉంటుంది.

Read Also: మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

Related News

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

Big Stories

Advertisement
×