E-Paper

OTT Movie: నరకమే భూమి మీదకు వస్తే? ఈ థాయ్ మూవీలో ప్రతి సీను క్లైమాక్సే.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

OTT Movie: నరకమే భూమి మీదకు వస్తే? ఈ థాయ్ మూవీలో ప్రతి సీను క్లైమాక్సే.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

OTT Movies: హార్రర్, ఫాంటసీ మూవీలంటే కేవలం హాలీవుడ్ సినిమాలే అనుకొనే రోజులు పోయాయ్. ఓటీటీల పుణ్యమా అని.. అన్ని ఇంటర్నేషనల్ సినిమాలు చూసేందుకు మనకు అవకాశం లభిస్తోంది. తాజాగా ఓటీటీలో విడుదలైన థాయ్-అమెరికన్ మూవీ ‘హోమ్ స్వీట్ హోమ్: రీబర్త్’ (Home Sweet Home: Rebirth).. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కట్టిపడేసే కథ.. విజువల్స్.. మతిపోగొడుతున్నాయి. ఇన్నాళ్లూ కొరియానే అనుకున్నాం. ఇప్పుడు థాయ్ మూవీస్ కూడా ఇంత మంచిగా ఉంటాయా అని ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. ఈ మూవీని 2017లో విడుదలైన ఓ థాయ్ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కించారు.

షాపింగ్ మాల్‌లో షూటౌట్

జేక్ (విలియం మోస్లీ) అనే అమెరికన్ పోలీసు అధికారి, తన భార్య ప్రాంగ్ (ఉరస్సయ స్పెర్బండ్), వారి చిన్న కుమార్తె లూ (అకీరా హాడెన్)తో కలిసి సెలవుల కోసం వస్తాడు. శెలవులు ఎంజాయ్ చేయడానికి వచ్చినా సరే.. జేక్ తన జాబ్‌లో బిజీగా ఉంటాడు. దీంతో అతడి భార్యే అన్నీ చూసుకుంటూంది. ఒత్తిడితో గడుపుతుంది. అయినా సరే వారి హాలీడేస్ హ్యపీగానే సాగుతాయి. సరిగ్గా అదే సమయంలో వారు వెళ్లిన ఓ షాపింగ్ మాల్‌లో భయానకమైన షూటింగ్ చోటుచేసుకుంటుంది.

అనుకోకుండా.. అతీంద్రియ ప్రపంచంలోకి…

ఆ షాపింగ్ మాల్‌లో జరిగే ఈ షూటింగ్ ఘటనలో జేక్‌కు మెక్ (మిచెల్ మోరోన్) అనే ఒక దుండగుడు ఎదురవుతాడు. జేక్ అతడిని ఎదుర్కొంటాడు. ఈ సందర్భంగా దుండగుడు మెక్.. ‘ది కీపర్’ అంటూ జేక్‌ను పిలుస్తాడు. ఆ తర్వాత ఓ బాంబు విసురుతాడు. ఆ పేలుడులో ఇద్దరూ చనిపోతారు. ఆ తర్వాత ఒక అతీంద్రియ రాజ్యంలో మేల్కొంటాడు. దీనిని ‘ది హిండ్రెన్స్’ అని పిలుస్తారు. ఇది మన తెలుగు సినిమాల్లో చూపించినట్లు యమలోకం లాంటిది. అక్కడ కనిపించేవి ఏవీ వాస్తవం కాదు. అంతా గందరగోళంగా ఉంటుంది.

నరక ద్వారాలను తెరిచేందుకు ప్రయత్నం

ది హిండ్రెన్స్‌లో జేక్‌కు.. నోవిస్(అలెగ్జాండర్ లీ) అనే సన్యాసి సహాయం చేస్తాడు. అప్పుడే అతడు మెక్ గురించి వాస్తవాలు తెలుసుకుంటాడు. మెక్.. ఒక దుష్టశక్తి ఆకల్టిస్ట్ అని, అతను నరక ద్వారాలను తెరవడానికి ప్రయత్నిస్తున్నాడని జేక్‌కు తెలుస్తుంది. ఈ ద్వారాలు తెరిచినట్లయితే బ్యాంకాక్ నగరంలో దెయ్యాలు విరుచుకుపడి ప్రజలను ఆవహించి, భయంకరమైన గందరగోళాన్ని సృష్టిస్తాయని నోవిస్ తెలుపుతాడు. దీంతో బ్యాంకాక్‌లో ఉన్న తన భార్య ప్రాంగ్, కుమార్తె లూకు కూడా దెయ్యాల్లా మారిపోతారనే భయంతో.. ఎలాగోలా మెక్ ప్రయత్నాలను ఆపాలని ప్రయత్నిస్తాడు.

దుష్టశక్తితో పోరాటం..

జేక్ తన కుటుంబాన్ని రక్షించడానికి, మెక్‌ను అడ్డుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. అయితే, అది అంత సులభమైన విషయం కాదు. మెక్‌కు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడమంటే ప్రాణాలతో చెలగాటమే. అయినా సరే.. జేక్ ఏ మాత్రం భయం లేకుండా దెయ్యాలు, రాక్షసులను ఎదుర్కొంటాడు. వీటిలో ఒక భయానక ఆడ దెయ్యం, ఒక భారీ రాక్షస జీవి కూడా ఉంటాయి. ఇవి థాయ్ ఇతిహాసాల నుంచి ప్రేరణ పొందినవి. ఇవే ఈ సినిమాకు హైలెట్. ఆ రాక్షసులను ఎదుర్కోడానికి నోవిస్ సహాయాన్ని పొందుతాడు జేక్. దీంతో ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని శక్తులను పొందుతాడు. వాటితో రాక్షసులను ఎదుర్కొంటాడు.

ఈ సందర్భంగా జేక్ కొన్ని రహస్యాలను తెలుసుకుంటాడు. అసలు మెక్ తనని ‘ది కీపర్’ అని ఎందుకు పిలిచాడు? తన గతం ఏమిటీ? అనే సందేహాలు జేక్‌ను తొలిచేస్తుంటాయి. అదే సమయంలో బ్యాంకాక్ నగరంలోకి దెయ్యాలు ప్రవేశిస్తాయి. అవి మనుషులపై దాడులు చేస్తాయి. దీంతో కథ మరింత ఉత్కంఠంగా మారుతుంది. మరి చివరికి జేక్ తన కుటుంబాన్ని రక్షించగలిగాడా? నరక ద్వారాలను తెరిచే ప్రయత్నాలను అడ్డుకోగలిగాడా అనేది స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. అయితే, థాయ్ గేమ్ గురించి తెలిసినవారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. దాని గురించి తెలియకపోతే కాస్త గందరగోళానికి గురికావచ్చు. కొన్ని పాత్రలు అర్థం కాకపోవచ్చు. ఈ మూవీ Amazon Prime Video, Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇండియాలోని అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్స్‌కు ఇంకా అందుబాటులోకి రాలేదు.

Related News

బాబోయ్ తేలు మనిషి… విజువల్ వండర్… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ ఆంథాలజీ

ఈ మూవీని చూశాక జన్మలో ఫుడ్ లవర్స్ జోలికెళ్లే సాహసం చేయరు… సినిమా 30 నిమిషాలే

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

మెంటల్ హాస్పిటల్ నుంచి తిరిగొచ్చే అక్కా చెల్లెల్లు… మెంటలెక్కించే కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్

జైలులోనే అతి కిరాతకంగా హత్య… సైకో కిల్లర్ కు చెక్ పెట్టే లేడీ కిలాడీ

ఊరినే వల్లకాడుగా మార్చే ఒకే ఒక్క పొరపాటు… సింగిల్ గా చూశారో ఫసక్

అర్థరాత్రి అమ్మాయిపై మోజు పడే ఆత్మ… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టే ట్విస్ట్

సముద్రం మధ్యలో చావును వెతుక్కుంటూ వెళ్ళే ఫ్రెండ్స్… ఈ హార్రర్ మూవీ క్లైమాక్స్ కేక

×