BigTV English

Circar Express: సర్కార్ ఎక్స్ ప్రెస్ లో వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే బుక్కైతారు!

Circar Express: సర్కార్ ఎక్స్ ప్రెస్ లో వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే బుక్కైతారు!

Circar Express Trains: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కలిగించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సర్కార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ప్యాసింజర్లకు దక్షిణ మధ్య రైల్వే కీలక విషయాన్ని వెల్లడించింది. 4 సర్కార్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణ తేదీల్లో మార్పులు చేసినటలు ప్రకటించింది. కొత్త మార్పులు అక్టోబర్ నుంచి అమలు కానున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు అందుకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


ఈ రైళ్ల ప్రయాణ తేదీల్లో మార్పులు

ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి-కాకినాడ మధ్య ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. చెంగల్పట్టు-కాకినాడ పోర్ట్ మధ్య ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ లు నంబర్ 17643/17644, అలాగే కాకినాడ పోర్టు-పుదుచ్చేరి మధ్య ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ లు నంబర్ 17655/17656 ల ప్రయాణ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.


⦿ చెంగల్పట్టు నుంచి -కాకినాడ పోర్టుకు ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17643 ప్రస్తుతం మంగళవారం, బుధవారం, శనివారం,ఆదివారం నడుస్తోంది. దీనికి బదులుగా అక్టోబర్ 3 నుంచి మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం నడవనుంది.

⦿ కాకినాడ పోర్టు నుంచి చెంగల్పట్టుకు వెళ్లే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17644 ప్రస్తుతం ఉన్న సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారానికి బదులుగా అక్టోబర్ 3 నుంచి మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం నడుస్తుంది.

⦿ కాకినాడ పోర్టు నుంచి పుదుచ్చేరికి ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17655 ప్రస్తుతం బుధవారం, గురువారం, ఆదివారం నడుస్తుండగా.. అక్టోబర్ 4 నుంచి సోమవారం, గురువారం, శనివారాల్లో నడపనున్నారు.

⦿ పుదుచ్చేరి నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17656 ప్రస్తుతం సోమవారం, గురువారం, శుక్రవారాల్లో ప్రయాణిస్తుండగా.. అక్టోబర్ 2 నుంచి సోమవారం, గురువారం, శనివారం నడపబోతున్నారు.

Read Also: మీకు తెలుసా? రాత్రిళ్లు కూడా మెట్రో రైళ్లు నడుస్తాయి, కానీ జనాలతో కాదు.. ఎందుకంటే?

ప్రయాణ సమయాల్లో నో ఛేంజ్!

కాకినాడ నుంచి తమిళనాడు, పుదుచ్చేరికి ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్లు ఈ మార్పులు తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. వీటికి అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడంతో పాటు టికెట్లు బుక్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న సర్కార్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదని రైల్వే అధికారులు తెలిపారు. గతంలో మాదిరిగానే, ప్రయాణాన్ని మొదలుపెట్టి, గమ్యస్థానానికి చేరుకుంటాయని వెల్లడించారు.

Read Also: వందే భారత్ స్లీపర్‌పై రైల్వే మంత్రి కీలక ప్రకటన.. వచ్చేది అప్పుడేనట!

Related News

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Big Stories

×