ENG Vs IND 5th test : ఇంగ్లాడ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కాస్త తడబడుతుందనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో టీమిండియా(Team India) టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగింది. అయితే వరుసగా 15 సార్లు టీమిండియా టాస్(Toss) ఓడిపోయి రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే.. టీమిండియా 83 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (2) మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో మరో ఓపెనర్ రాహుల్ కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. గత మ్యాచ్ లో సెంచరీ మిస్ రాహుల్ ఈ మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేసి వోక్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. తొలి సెషన్ లో ఇద్దరూ ఓపెనర్లు ఔట్ కాగా.. రెండో సెషన్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది.
Also Read : Team India Record : టీమిండియా చెత్త రికార్డు… ఏకంగా 15 మ్యాచ్ లలో ఓడిపోయారా
అంఫైర్ కారణంగా రివ్యూకి నిరాకరించిన ఇంగ్లాండ్
అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 23 ఓవర్ల ఆట తరువాత వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిపివేశారు. అప్పటికీ భారత్ స్కోర్ 72/2 సాయి సుదర్శన్ (250, శుబ్ మన్ గిల్ (15) క్రీజులో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ కు ఆన్ ఫీల్డ్ ఎంఫైర్లలో ఒకరైన కుమార్ ధర్మసేన పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్ ఒక రివ్యూ ను కోల్పోకుండా కాపాడారు. అసలు ఏం జరిగిందంటే.. జోష్ టంగ్ వేసిన 13వ ఓవర్ లో రెండో బంతిని సాయి సుదర్శన్ ఎదుర్కొన్నాడు. ఇన్ స్వింగ్ యార్కర్ గా వచ్చిన ఈ బంతిని ఆడే క్రమంలో సాయి సుదర్శన్ కింద పడ్డాడు. అయితే బంతి బ్యాట్ కి తాకింది. ఈ విషయాన్ని గమనించని ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. కానీ అంపైర్ కుమార్ ధర్మసేన 15 సెకర్ల డీఆర్ఎస్ టైమర్ ముగియక ముందే బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ అయిందని తల ఊపుతూ.. తన చేతి వేళ్లతో సైగ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు రివ్యూ కి వెళ్లలేదు. ఒక వేళ ఇంగ్లాండ్(England) జట్టు డీఆర్ఎస్ కోరితే ఒక రివ్యూను కోల్పేయేది.
అంఫైర్ ఇలా చేయడం మంచి పద్దతి కాదు..
అయితే ఎంఫైర్ సైగ చేయడం తో ఇంగ్లాండ్ (England) రివ్యూ తీసుకోలేదని.. ఎంఫైర్లు ఇలా వ్యవహరించడం మంచి పద్దతి కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏంటీ ధర్మసేన.. ఇదేం అంఫైరింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీమిండియా ప్రస్తుతం 4 వికెట్లను కోల్పోయింది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ శుబ్ మన్ గిల్ (21) రనౌట్ అయ్యాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేస్తాడనుకున్న సమయంలోనే 38 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ కీలక మ్యాచ్ లో కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ వంటి బ్యాట్స్ మెన్ లు తమ సత్తా చాటి టీమిండియాను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తారో లేదో వేచి చూడాలి మరీ.
Why is Sri Lankan umpire Kumar Dharmasena telling the English bowler that it's a clear edge by showing his fingers?@ICC what's going on ? Clearly he is fixing there because he showed that signal that's why English fielders don't appeal after that and don't go for review… pic.twitter.com/hkqu6UFd2X
— MK (@mkr4411) July 31, 2025