OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉండే హింస చూసి తట్టుకోవడం చాలా కష్టం. చాలామంది మనుషులకు డిఫరెంట్ సైకాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వీటిలో కొంతమంది తారా స్థాయికి చేరుకుంటారు. ఇటువంటి వ్యక్తులు, తమ ఒత్తిడి తగ్గించుకోవడానికి కొంతమంది మనుషులను టార్చర్ చేసి చంపుతుంటారు. వీళ్ళకి మనుషులను ఒక గ్యాంగ్ సప్లై చేస్తూ ఉంటుంది. ఈ స్టోరీతో ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేసింది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హాస్టల్ ‘ (Hostel). ఈ మూవీకి ఎలి రోత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జే హెర్నాండెజ్, డెరెక్ రిచర్డ్‌సన్, ఐయోర్ గుజాన్సన్, బార్బరా నెడెల్జాకోవా నటించారు. ఈ మూవీ అమెరికన్ పర్యాటకులను ఒక ముఠా కిడ్నాప్ చేసి, హింసించడానికి, చంపడానికి ఒక సంస్థకు ఒక్కొక్కరిగా తీసుకువెళతారు. ఈ మూవీ $4.8 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $82 మిలియన్లు వసూలు చేసింది. ఆ తరువాత హాస్టల్: పార్ట్ II, హాస్టల్: పార్ట్ III కూడా వచ్చాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జోష్, రాంగ్స్టన్, అలీ ముగ్గురు స్నేహితులు వెకేషన్ కి, అమెరికా నుండి లండన్ వెళ్తారు. అక్కడ ఒకచోట హాస్టల్లో ఉంటూ ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఒక డిఫరెంట్ హాస్టల్ ఉందని తెలుసుకుంటారు. అక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చని, అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీళ్లకు చెప్తాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఆ హాస్టల్ కి వెళ్తారు. అక్కడ అమ్మాయిలు చాలా మంది ఉంటారు. వీళ్ళ ముగ్గురిని, ముగ్గురు అమ్మాయిలు ఎంజాయ్ చేద్దామని లోపలికి తీసుకెళ్తారు. అయితే ఆ మరుసటి రోజు అలీ మిస్ అవుతాడు. మిగతా ఇద్దరూ అతని కోసం వెతుకుతారు. అలీ, ఒక అమ్మాయి తో చెక్ అవుట్ అయ్యాడని, అక్కడున్న నటాలియ అనే అమ్మాయి చెప్తుంది. అక్కడికి ఒక జపనీస్ అమ్మాయి వచ్చి, తన అక్కతో అలీ వెళ్ళాడని ఒక ఫోటో కూడా చూపిస్తుంది. నిజానికి అలీని అక్కడున్న సైకోలు తలను వేరుచేసి చంపేసి ఉంటారు. ఆ తర్వాత జోష్ ని కూడా ఆ సైకోలు చంపేస్తారు. రాంగ్స్టన్ కి ఏదో జరుగుతుందని అర్థమవుతోంది.
నటాలియాను గట్టిగా అడగడంతో అతన్ని ఆమె ఒక చోటికి తీసుకు వెళుతుంది. అక్కడ ఇదివరకే చనిపోయిన తన ఫ్రెండ్స్ ని కూడా చూపిస్తుంది. రాంగ్స్టన్ ను అక్కడున్న వ్యక్తులు ఒకచోట బంధిస్తారు. అక్కడికి డబ్బున్న వ్యక్తులు తమ ఫ్రస్టేషన్ తీర్చుకోవడానికి వచ్చి, డబ్బు బాగా ఇచ్చి మనుషుల్ని టార్చర్ చేసి చంపుతారు. వీరిలో అమెరికన్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అమెరికన్స్ కావడంతో, ఆ సైకో గ్యాంగ్ వీళ్ళని వెంబడించి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేస్తుంది. చివరికి రాంగ్స్టన్ కూడా, వీళ్ళ చేతిలో బలవుతాడా? పోలీసులు ఇతనికి సహాయం చేస్తారా.? ఆ నరకం నుంచి రాంగ్స్టన్ బయటపడతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.