OTT Movie : సూపర్ నేచురల్ పవర్ తో వచ్చే సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా హీరోకి ఒక సూపర్ నేచురల్ పవర్ వస్తుంది. అదేమంటే.. అమ్మాయిలు తన మనసులో ఏమనుకుంటున్నారో అది హీరోకి తెలిసిపోతుంది. ఈ పవర్ తో హీరో ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేశాడనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘వాట్ ఉమెన్ వాంట్‘ (What women want). ఈ అమెరికన్ రొమాంటిక్ ఫాంటసీ కామెడీ మూవీకి నాన్సీ మేయర్స్ దర్శకత్వం వహించారు. మెల్ గిబ్సన్, హెలెన్ హంట్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. $70 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ, ప్రపంచవ్యాప్తంగా $374 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
నిక్ అమ్మాయిల ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే కంపెనీలో పనిచేస్తుంటాడు. ప్రమోషన్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తుంటాడు. అందరూ కూడా ఇతనికే ప్రమోషన్ వస్తుందని అనుకుంటారు. అయితే అనుకోకుండా ఆ కంపెనీలో పనిచేసే డెర్సీ కి కంపెనీ ప్రమోషన్ ఇస్తుంది. నిక్ ప్రమోషన్ రానందుకు చాలా బాధపడతాడు. అయితే మరోవైపు నిక్, మాజీ భార్యకు పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరూ హనీమూన్ కు వెళ్తుండగా కూతురు అలెక్సా ని చూసుకోమని నిక్ కి చెప్తుంది ఎక్స్ వైఫ్. ఈ క్రమంలో అలెక్సాని జాగ్రత్తగా చూసుకుంటాడు నిక్. అయితే అలెక్సా తనకన్నా పెద్దవాడైన ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటుంది. ఆ విషయం నిక్ కి ఇష్టం ఉండదు. ఇలా జరుగుతుండగా ఒక రోజు బాత్రూంలో కాలుజారి పడతాడు. తలకు దెబ్బ తగలడంతో, ఆ మరుసటి రోజు నుంచి హీరోకి ఒక వింత పవర్ వస్తుంది. అదేమంటే ఆడవాళ్ళు మనసులో ఏమనుకుంటే అది ఇతనికి వినపడుతుంది. ఈ పవర్ తో ఇబ్బంది పడుతున్న నిక్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతాడు. మొదట నిక్ చెప్పేది ఆ డాక్టర్ నమ్మదు. అయితే తన మనసులోని మాటను కరెక్ట్ గా చెప్పడంతో తర్వాత నమ్ముతుంది. నిక్ తో డాక్టర్ ఈ పవర్ ని నీకు ప్లస్ గా ఉపయోగించుకో అని సలహా ఇస్తుంది.
ఆ తర్వాత నిక్ కంపెనీలోని డెర్సీ మనసులో ఉండే ఐడియాలను వాడుకొని, అందరికీ నెనే వీటిని క్రియేట్ చేశానని చెప్తాడు. మరోవైపు డెర్సీ తన ఐడియా ఇతనికి ఎలా తెలిసిందని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ బాగా దగ్గరవుతారు. డార్సినీ మైక్ ఎక్కువే ఇష్టపడతాడు. కొద్దిరోజులకు మైక్ పెర్ఫార్మెన్స్ బాగుండటంతో డార్సిని ఉద్యోగంలో నుంచి తీసేయాలనుకుంటారు. ఆ తర్వాత తను చేసిన తప్పును తెలుసుకొని, ఈ ఐడియాలు డెర్సీ చేసినవే అని కంపెనీ యజమానితో ఒప్పించి తన జాబ్ పోకుండా చూస్తాడు. ఆ తర్వాత డెర్సీకి తన పవర్ గురించి చెప్తాడు. మొదట కోప్పడ్డ డార్సి, ఆ తర్వాత అర్థం చేసుకుంటుంది. చివరికి మైక్ కి ఈ పవర్ అలాగే ఉంటుందా? ఈ పవర్ తో ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.