Kangana Ranaut: సౌత్‌లో పోలిస్తే నార్త్ పరిశ్రమలో రాజకీయాలు అనేవి చాలా కామన్ అని చాలామంది నటీనటులు ఓపెన్‌గా కామెంట్స్ చేస్తుంటారు. ఇది ప్రేక్షకులకు కూడా తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ బాలీవుడ్ మొత్తం ఎలా ఉన్నా.. నా రూటే సెపరేటు అనుకుంటూ తన దారి తాను చూసుకునే హీరోయిన్ కంగనా రనౌత్. తనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా బాలీవుడ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్‌పై ఇప్పటికే ఎన్నో ఘాటు కామెంట్స్ చేసింది కంగనా. వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గుమంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక రియాలిటీ షోలో కరణ్ జోహార్ పేరును ప్రస్తావిస్తూ కంగానే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ గొడవలే
బాలీవుడ్‌లో కరణ్ జోహార్ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ తను మాత్రం ఆ ట్రాప్‌లో పడను అంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లేది కంగనా రనౌత్ (Kangana Ranaut). అందుకే బాలీవుడ్‌పై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కరణ్‌తో కలిసి అసలు పనిచేయడానికి కూడా ఇష్టపడలేదు ఈ సీనియర్ హీరోయిన్. అలాంటిది తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ (Emergency) ప్రమోషన్స్ కోసం ఒక రియాలిటీ షోకు గెస్ట్‌గా వచ్చిన కంగనా.. కరణ్ జోహార్‌తో కలిసి పనిచేయాలని ఉందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Also Read: లెక్కల మాస్టారు లెక్క తప్పింది… అంత పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు ?
అలాంటి సినిమా కాదు
‘‘ఇది చెప్పడానికి ఏదోలా ఉంది కానీ కరణ్ జోహార్ (Karan Johar) నాతో ఒక సినిమా చేయాలి. నేను ఆయనకు మంచి పాత్ర ఇస్తాను. పైగా ఆయనతో కలిసి మంచి మూవీ చేస్తాను. అది మామూలు అత్త, కోడలు గొడవ లాంటి సినిమా కాదు. కేవలం పీఆర్ కోసం చేసే మూవీ కాదు. కానీ మంచి సినిమా అయ్యింటుంది. ఆయనకు కూడా అందులో మంచి పాత్ర ఉంటుంది’’ అంటూ ఇప్పటివరకు కరణ్ జోహార్ చేసిన సినిమాలు కేవలం పీఆర్ కోసమే అన్నట్టుగా ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది కంగనా రనౌత్. అసలు సందర్భం లేకుండా కరణ్ పేరును ప్రస్తావించి, తనకు సినిమా ఆఫర్ ఇస్తానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం కంగనా రనౌత్ స్టైల్ అని తన ఫ్యాన్స్ అంటున్నారు.
సెన్సార్ కష్టాలు
ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కంగనా రనౌత్. తానే హీరోయిన్‌గా నటించి తానే డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సెన్సార్ నుండి కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమా జనవరిలో విడుదలకు సిద్ధమయ్యింది. ‘‘ఎమర్జెన్సీకి సంబంధించిన ఫుల్ వర్షన్ బయటికొస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ సెన్సార్ కట్స్‌తో కూడా నాకేం సమస్య లేదు. ఎందుకంటే మేము ఈ సినిమాను ఎవరి గురించో వ్యగ్యంగా చెప్పడానికి అయితే తెరకెక్కించలేదు. కానీ హిస్టరీకి సంబంధించిన చాలా ఎపిసోడ్స్‌ను సెన్సార్ తీసేసింది’’ అంటూ వాపోయింది కంగనా రనౌత్.