BigTV English

OTT Movie : పెళ్లై పిల్లాడున్న అమ్మాయితో ఇదేం పాడు పని సామీ… వీడి పిచ్చికి ఫ్యామిలీ అంతా షాక్

OTT Movie : పెళ్లై పిల్లాడున్న అమ్మాయితో ఇదేం పాడు పని సామీ… వీడి పిచ్చికి ఫ్యామిలీ అంతా షాక్

OTT Movie : పెళ్ళయి పిల్లలున్న అమ్మాయిని కాంట్రాక్ట్ పెళ్ళాంగా ఉండమని ఒక బిలియనీర్ అడగడం… వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే స్టోరీ లైన్ తో ఒక సిరీస్ ఏళ్ల తరబడి సూపర్ హిట్ గా నిలిచింది. ఇండియాలో ఇలాంటివి చేస్తే వీపు విమానం మోత మోగుతుంది. కానీ కొరియన్ డ్రామాలలో మాత్రం ఇలాంటివి ఎలాంటివి అఫిషియల్ గానే దర్శనం ఇస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ మాత్రం టర్కిష్ సిరీస్.


కథలోకి వెళ్తే…
ఇస్తాంబుల్‌లో తన జాలరి తండ్రి షెవ్కెట్ తో నివసించే డేరింగ్ అమ్మాయి జెయినెప్. కుటుంబం అనుమతి లేకుండా తన ప్రియుడు ఎర్టాన్ సోన్మెజ్ తో అమెరికాకు పారిపోతుంది. ఆమె గర్భవతి అని తెలిశాక ఎర్టాన్ ఆమెను వదిలేస్తాడు. హృదయం బద్దలైన జెయినెప్, తన బిడ్డ సెలిమ్‌తో ఒంటరి తల్లిగా బతకలేక, 10 నెలల తర్వాత టర్కీకి నిరాశతో తిరిగి వస్తుంది.

మరోవైపు సంపన్న టర్కిష్ కుటుంబానికి చెందిన యువకుడు ఫాతిహ్ షెకెర్సిజాడే, తన తల్లి ముకద్దెస్ చేసే ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి అమెరికాకు చదువుకోవడానికి వెళతాడు. కానీ బ్రేకప్ అవ్వడంతో నిరాశతో టర్కీకి తిరిగి వస్తాడు. న్యూయార్క్ నుండి ఇస్తాంబుల్‌కు వచ్చే విమానంలో జెయినెప్, ఫాతిహ్ కలుస్తారు. ఇద్దరూ తమ కుటుంబ ఒత్తిడుల నుండి తప్పించుకోవడానికి అక్కడే నకిలీ వివాహ ఒప్పందం చేసుకుంటారు.


ఫాతిహ్ తన తల్లి ఎంపిక చేసిన ఇరెమ్ ను వివాహం చేసుకోకుండా ఉండడానికి… జెయినెప్‌ను భార్యగా, సెలిమ్‌ను కొడుకుగా నటించమని కోరుతాడు. జెయినెప్ తన బిడ్డ గురించి తన తండ్రికి వివరించడానికి సమయం కావాలని ఆలోచించి ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుంది. ఈ నకిలీ వివాహం వల్ల ఇద్దరూ తమ కుటుంబాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, క్రమంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. జెయినెప్ తన గతం గురించి ఫాతిహ్‌తో పంచుకుంటుంది. ఫాతిహ్ సెలిమ్‌తో ఒక ప్రేమపూర్వక సంబంధాన్ని పెంచుకుంటాడు. మరి చివరికి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారా? అసలు ఇది ఫేక్ పెళ్లి అని తెలిశాక ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది ? అనేది తెరపై చూడాల్సిందే.

Read Also : ఇండియన్ హిస్టరీలో జరిగిన పెను విషాదం… హంతకుల వేట అదుర్స్… ట్విస్టులతో పిచ్చెక్కించే వెబ్ సిరీస్

ఏ ఓటీటీలో ఉందంటే?
“ఇన్ లవ్ ఎగైన్” (Aşk Yeniden / In love again) ఒక టర్కిష్ యూత్ ఫుల్ కామెడీ టెలివిజన్ సిరీస్. సూరెక్ ఫిల్మ్ నిర్మాణంలో, ఎర్సోయ్ గులెర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో ఓజ్గే ఓజ్పిరిన్క్సి (జెయినెప్), బుగ్రా గుల్సోయ్ (ఫాతిహ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2015 ఫిబ్రవరి 10 నుండి 2016 జూన్ 14 వరకు ఫాక్స్ టీవీలో 2 సీజన్‌లు, 59 ఎపిసోడ్‌లతో ప్రసారమైంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×