Director Devi prasad: ఈమధ్య జనాలు మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే టాలీవుడ్ డైరెక్టర్ దేవి ప్రసాద్ ఓ నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయారంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. డైరెక్టర్ నిర్మాత చేతిలో మోసపోవడం ఏంటి అని అనుమానం రావచ్చు.. కానీ ఇది నిజమని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? డైరెక్టర్ ఎలా నష్టపోయారు? అసలు కథ ఏంటి? వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
‘బ్లేడు బాబ్జి’ తో తర్వాత బిజీ..
బ్లేడ్ బాబ్జీ డైరెక్టర్ దేవీ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని హెచ్చరించారు. తాను తెరకెక్కించిన బ్లేడ్ బాబ్జీ సినిమా హిట్ అవ్వగానే రెగ్యులర్ గా సినిమాలు తీసే కొందరు నిర్మాతలు సినిమా చేయమని అడిగారు కానీ ఎవ్వరూ అడ్వాన్స్ ఇవ్వలేదు, కొత్త నిర్మాత మిమ్మల్ని ఫోన్ చేసి కలవాలి ఫోన్ చేసినట్లు చెప్పారు. ఇక నేరుగా ఆయన ఇంటికి వచ్చి కలిశారు. కాఫీ తాగి ఏవో నాకర్ధంకానికి తన సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ల గురించి చెప్పి, మీ సినిమాలు చూసి, మీతో సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి 50 సినిమాలు తీయాలని ఉందని, ఎవరితో చేసినా, మీరు ఏ కథ చేసినా నాకు ఓకే అన్నారు. ఆ మాట వినగానే నిజంగా నాకు సంతోషంగా అనిపించింది. అది నిజమే అనుకొని పూర్తిగా నమ్మేసాను అని డైరెక్టర్ అన్నారు.
Also Read: వివాదంలో ” వీరమల్లు “.. రిలీజ్ అడ్డుకుంటామంటూ వార్నింగ్
నిండా ముంచిన నిర్మాత.. 14 లక్షలు లాస్..
ఒక నిర్మాత మన దగ్గరికి వచ్చి సినిమాలు చేస్తామంటే మనకు ఆ ఆనందమే వేరు కదా.. నేను కూడా వెనక ముందు ఆలోచించకుండా తల ఊపేసాను. ఆ తర్వాత సినిమా గురించి పలుమార్లు ఫోన్లు వచ్చాయి. ఒకరోజు ఆయనే స్వయంగా మాకు కారు పంపించి తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ భవనం చూసి లోపల ఉన్న లగ్జరీ లైఫ్ ని చూసి సినిమాకు ఎంతైనా పెట్టగలరని ఆలోచించాను. ఆ తర్వాత వారం రోజుల తర్వాత పిలిచి ఇప్పుడు డబ్బులు లేవు కాస్త టైం పడుతుంది అని అన్నారు. ఆ తర్వాతఅతను కనిపించలేదు. కాల్ వచ్చింది. “సారీ సార్, సడన్ గా క్యాష్ ని బిజినెస్ కి మళ్లించాల్సి వచ్చింది..మళ్ళీ రేపటి రోజు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి చెక్ ఇస్తాం అన్నారు.మళ్ళీ రేపటి రోజు వచ్చింది.ఈసారి అయన రాలేదు,ఫోన్ రాలేదు.
లైట్ తీసుకోవడం అలవాటు కాబట్టి వదిలేశాను. వారం రోజుల తర్వాత మా టీచర్ ఫోన్ చేసి ఇప్పుడు ఏ పని చేయకు నీకు మంచి టైం కాదు అని ఎంత చెప్పినా కూడా వినకుండా నేను నా ఫ్రెండ్ కలిసి డబ్బులు ఇచ్చేశాం. ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేసేసి తీసేసారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇక మేము మోసపోయామని అనుకున్నాము అని డైరెక్టర్ అన్నారు. ఏదైనా ముందు వెనక ఆలోచించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని డైరెక్టర్ చెప్పుతున్నారు. ప్రస్తుతం ఈయన సినిమాల్లో పలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇకముందు సినిమాలు చేస్తారేమో చూడాలి.