OTT Movie : కొన్ని సినిమాలలో వయొలెన్స్ చూస్తే బ్లడీ బ్లడ్ బాత్… వీళ్లెక్కడి సైకోలురా బాబోయ్ అన్పిస్తుంది. అలాంటి మూవీనే ఈ రోజు మన మూవీ సజెషన్. ఇందులో జైలులో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మరి ఈ సినిమా పేరేంటి? ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ స్టోరీ ఏంటి? అనేది తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
కథ మార్క్ కోబ్డెన్ (షాన్ బీన్) అనే మాజీ టీచర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక దురదృష్టకర సంఘటనలో ఒక వ్యక్తిని చంపి, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తాడు. మార్క్ ఒక సాధారణ, సున్నితమైన వ్యక్తి. అతను తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో బాధపడుతూ, జైలు జీవితంలోని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు. అదే సమయంలో ఎరిక్ మెక్‌నల్లీ (స్టీఫెన్ గ్రాహం) అనే జైలు అధికారి తన కొడుకు డేవిడ్‌ను రక్షించడానికి ట్రై చేస్తాడు. కానీ డేవిడ్ కూడా అదే జైలులో ఖైదీగా ఉండడంతో ఆలోచనలో పడతాడు.
శిక్షను అనుభవిస్తున్న టైమ్ లో కొంతమంది తోటి ఖైదీలు అతనితో దారుణంగా ప్రవర్తిస్తారు. హీరో తన ఫ్యామిలీతో మాట్లాడుతున్న టైమ్ లో ఫోన్ లాక్కోవడం, వాళ్ళు అతనికి ఫోన్ ఇవ్వకుండా ఎక్కువసేపు మాట్లాడడం, కొట్టడం, ప్లేట్ లో ఉమ్మేయడం లాంటి దారుణమైన పనులు చేస్తారు. అయితే తోటి ఖైదీలు ఎంత హింసించినా హీరో మాత్రం ఎదురు తిరగడు. ఒకానొక సమయంలో ఓ సైకో ఖైదీ అయితే ఏకంగా ఫ్లాస్క్ లో షుగర్ సిరప్ వేడి చేసి, మరో ఖైదీ ముఖంపై పోస్తాడు. ఇంతటి భయంకరమైన పరిస్థితులలో హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు? ఎందుకు అతను తనకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరగట్లేదు ? చివరికి ఏం జరిగింది? రియల్ లైఫ్ లో టీచర్ అయిన ఆయన జైల్లో ఉన్న వారికి ఎలా బుద్ధి చెప్పాడు? ఖైదీలలో ఏమైనా మార్పు తీసుకు రాగలిగాడా ? అన్నదే స్టోరీ.
Read Also : ఆన్ లైన్ లో భర్త ప్రైవేట్ వీడియో… ఓటీటీలో దుమ్మురేపుతున్న ప్రియమణి కోర్టు రూమ్ డ్రామా
ఏ ఓటీటీలో అందుబాటులో ఉందంటే?
ఈ సిరీస్ పేరు “టైమ్” (Time). 2021లో వచ్చిన ఇది మూడు ఎపిసోడ్‌ల బ్రిటీష్ డ్రామా మినీ-సిరీస్, ఇది ఒక జైలు వాతావరణంలో జరిగే ఎమోషనల్, ఇంటెన్స్ స్టోరీ. దీన్ని చూశాక జైలు అంటేనే వణుకు పుట్టడం ఖాయం. లూయిస్ జేమ్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ఇంటెన్స్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ మంచి ఆప్షన్. భాష అడ్డు కాదనుకుంటే ఖచ్చితంగా ఓ లుక్కేయండి.