OTT Movie : ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. పెద్దగా చెప్పుకోదగ్గ కొత్త సినిమాల రిలీజ్ లు ఏమీ లేకపోవడంతో ఓటీటీలోకి తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ లను చూస్తూ కాలం గడపడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు మూవీ లవర్స్. అయితే గతంలో ఇండియన్ హిస్టరీలో జరిగిన పెను విషాదం ఆధారంగా తెరకెక్కిన ఓ సిరీస్ తాజాగా ఓటీటీలో దుమ్మురేపుతోంది. హంతకుల వేట విషయంలో ట్విస్టులతో పిచ్చెక్కిస్తున్న ఆ సిరీస్ ఏంటి? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే
సిరీస్ 1991 శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాజీవ్ గాంధీపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడితో మొదలవుతుంది. ఈ దాడిలో రాజీవ్ గాంధీతో పాటు 16 మంది చనిపోతారు. దేశాన్ని షాక్‌కు గురి చేసిన ఈ హత్య వెనుక లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) ఉందని తెలుస్తుంది, ఇది అప్పట్లో శ్రీలంకలో తమిళ ఈలం కోసం పోరాడుతున్న ఒక తీవ్రవాద సంస్థ.
తరువాత సీబీఐ అధికారి డి.ఆర్. కార్తికేయన్‌ను ఈ కేసును దర్యాప్తు చేయడానికి నియమిస్తారు. అతను అమిత్ వర్మ (సాహిల్ వైద్), రాఘోత్తం (బగవతి పెరుమాళ్), అమోద్ కాంత్ (దానిష్ ఇక్బాల్), రాధ వినోద్ రాజు (గిరీష్ శర్మ)తో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. 1991లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌లు, లేదా డిజిటల్ సర్వైలెన్స్ లేని కాలంలో ఈ బృందం ల్యాండ్‌లైన్ ఫోన్‌లు, స్థానిక ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై ఆధారపడి దర్యాప్తును నడిపిస్తుంది. అసలు అలాంటి టైమ్ లో 90 రోజుల్లోనే నిందితులను ఎలా పట్టుకున్నారు? రాజీవ్ గాంధీని హత్య చేసింది ఎవరు? ఆయన సెక్యూరిటీలో ఉన్న లోపాలు ఏంటి? అసలైన హంతకుడిని పట్టుకుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అనే ఇంట్రెస్టింగ్ అంశాలను తెరపై చూడాల్సిందే.
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుదంటే ?
ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ పేరు ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ రియల్ స్టోరీని అనిరుద్య మిత్రా రాసిన ‘నైంటీ డేస్: ది ట్రూ స్టోరీ ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీస్ అస్సాసిన్స్’ అనే బుక్ ఆధారంగా తెరకెక్కించారు. తెలుగు దర్శకుడు నాగేష్ కుకునూర్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. సిరీస్ మొత్తం 7 (ఒక్కొక్కటి సుమారు 50-53 నిమిషాలు) ఎపిసోడ్లు ఉంది. ఇందులో అమిత్ సియాల్ (డి.ఆర్. కార్తికేయన్), సాహిల్ వైద్ (అమిత్ వర్మ), బగవతి పెరుమాళ్ (రాఘోత్తం), షఫీక్ ముస్తఫా (సివరాసన్), దానిష్ ఇక్బాల్ (అమోద్ కాంత్), గిరీష్ శర్మ (రాధవినోద్ రాజు), విద్యుత్ గార్గ్ (రవీంద్రన్) తదితరులు నటించారు. ఒకవేళ ఎలాంటి కాన్స్పిరసీ ఎక్స్పెక్ట్ చేయకుండా, హంతకుల హంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం సోనీ లివ్ (Sonyliv)లో అందుబాటులో ఉంది.