OTT Movie : భయంకరమైన హారర్ విజువల్స్, అదిరిపోయే ట్విస్ట్‌లతో ఒక ఇండోనేషియన్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ ఒక మారు మూల విలేజ్‌లో జరుగుతుంది. గ్రామానికి ఉన్న ఒక వింత శాపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇండోనేషియాలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా ఒక ఊపు ఊపింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివారాల్లోకి వెళ్తే …
‘ఇంపెటిగోర్’ (Impetigore) 2019లో విడుదలైన ఇండోనేషియన్ ఫోల్క్ హారర్ ఫిల్మ్. దీన్ని జోకో అన్వర్ డైరెక్ట్ చేశాడు. సినిమా 1 గంట 46 నిమిషాలు ఉంది. లీడ్ రోల్స్‌లో తారా బాస్రో (మాయా), మారిస్సా అనితా (దీని), క్రిస్టీన్ హాకిమ్ (ఇంబువ్) ఉన్నారు. ఈ సినిమా 2019 ఆక్టోబర్ 31న ఇండోనేషియాలో విడుదలైంది. 2020లో Shudder, నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్‌గా అందుబాటులో ఉంది. ఐయండిబిలో 6.6/10, Rotten Tomatoesలో 100% రేటింగ్ ను కలిగి ఉంది.
మాయా అనే అమ్మాయి జాకార్టా నగరంలో టోల్ బూత్ లో పని చేస్తుంటుంది. ఆమె చాలా పేద అమ్మాయి. ఆర్థిక సమస్యలతో ఉంటుంది. ఒక రోజు రాత్రి ఒక విచిత్రమైన మనిషి వచ్చి మాయాపై కత్తితో దాడి చేయడానికి ట్రై చేస్తాడు. అతను “నువ్వు రహాయువి, నా గ్రామం నాశనానికి కారణం నువ్వే ” అని అరుస్తాడు. మాయా భయపడుతుంది. ఆమె పేరు మాయా, కానీ ఈ మనిషి రహాయు అని పిలుస్తాడు. మాయా తన బెస్ట్ ఫ్రెండ్ డినికి ఈ విషయం చెబుతుంది. ఆమె నీ బాల్యంలో నీ పేరు రహాయు అయి ఉండవచ్చు. నీ తల్లి నిన్ను చిన్నప్పుడు ఆ గ్రామం నుండి తీసుకువచ్చింది అని చెప్తుంది. దీంతో మాయా ఆ గ్రామానికి వెళ్తుంది. ఆమె పూర్వీకుల ఇల్లు అక్కడ ఉంది, దాన్ని అమ్ముకుంటే డబ్బు వస్తుందని తెలుసుకుంటుంది. అయితే ఆ గ్రామం చాలా దూరం, రోడ్లు కూడా లేవు, ఇళ్లు పాతది.
అది కాకుండా గ్రామంలో పిల్లలు అందరూ చనిపోయారు. మిగిలిన పిల్లలు ఇంపెటిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి వల్ల చర్మం పగిలి, రక్తం కారి చనిపోతుంటారు. ఇప్పుడు గ్రామస్తులు మాయాను చూసి భయపడతారు. రహాయు వచ్చిందని ఎదో మాట్లాడుకుంటారు. మాయా తన పాత ఇంటిని కనిపెడుతుంది. లోపల పిల్లల బొమ్మలు, రక్తం మరకలు. రాత్రి అయితే ఏడుపు సౌండ్స్, వస్తుంటాయి. ఆ గ్రామ హెడ్ ఇంబువ్ మాయాను స్వాగతిస్తుంది. ఆమె ఈ గ్రామంలో పిల్లలు జన్మించినా చనిపోతారు. ఇది శాపం. ఈ శాపం నీ తల్లి వల్ల వచ్చింది అని చెప్తుంది. మాయా అన్ని గుర్తుచేసుకుంటుంది. గ్రామస్తులు ఆమె తల్లిని చంపడానికి ట్రై చేశారు. చిన్నప్పుడు ఆమె తల్లి గ్రామం వదిలి వెళ్లింది.
Read Also : పిల్ల రూపంలో వచ్చే పిశాచి భయ్యో… డోర్ తీశారో దరువే… ఒంటరిగా చూడకూడని హర్రర్ మూవీ
అప్పట్లో మాయా తల్లి గ్రామ హెడ్గా ఉండేది. ఆమె పిల్లల బొమ్మలు తయారు చేసేది. కానీ ఆ బొమ్మలు జీవంతో ఉండేవి. ఆ బొమ్మలు పిల్లలను చంపేవి. దీంతో గ్రామస్తులు ఆమె తల్లిని మంత్రగత్తె అని భావించి దాడి చేశారు. తల్లి మాయాను తీసుకుని పారిపోయింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే మయా తల్లి మంత్రగత్తె కాదు. అయితే నిజానికి మయా తల్లి గ్రామంలో ఒక బ్లాక్ మ్యాజిక్ ని ఆపడానికి ట్రై చేసింది. దీంతో ఆమెను అక్కడి నుంచి తరిమేశారు. అయితే ఒక శాపం ఆ గ్రామాన్ని వెంటాడుతోంది. మాయా వల్లే ఈ శాపం పోతుంది. మయా ఇప్పుడు ఆశాపాన్ని ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్లైమాక్స్ చాలా భయంకరంగా ఉంటుంది. మయా ఆ శాపం పోవడానికి ఏం చేస్తుంది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.