E-Paper
Advertisement

కోమా నుంచి లేచాక ఎదుటివాళ్ల మనసులోని మాటలు వినిపిస్తే ? కడుపుబ్బా నవ్వించే మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా

కోమా నుంచి లేచాక ఎదుటివాళ్ల మనసులోని మాటలు వినిపిస్తే ? కడుపుబ్బా నవ్వించే మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా
Advertisement

Malayalam Comedy Mystery Movie OTT : మనసులో ఒకటి అనుకుంటూ బయటకు మరొకటి మాట్లాడటం చాలామందికి అలవాటే. ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా ఎదుటివారిని బాధపెట్టకూడదని కొన్ని మాటలను దాచేస్తుంటాం. మరికొన్ని విషయాలు చెప్పాలని ఉన్నా ధైర్యం సరిపోదు. అలాంటి సమయంలో మన చుట్టూ ఉన్నవాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో మనకు స్పష్టంగా వినిపిస్తే ఎలా ఉంటుంది? బయటకు నవ్వుతూ పలకరించే వ్యక్తి లోపల ఏం ఆలోచిస్తున్నాడో తెలిసిపోతే లైఫ్ గందరగోళంగా మారిపోతుంది. ఇదే ఆలోచనను వినోదభరితంగా మలిచిన మలయాళం చిత్రం ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ (It’s a Medical Miracle). ఒక వైద్య అద్భుతంలా మొదలైన సంఘటన క్రమంగా జ్ఞాపకాలు, ముసుగులు, ప్రతీకారంతో ముడిపడిన చిక్కుముడిగా మారితే ఏమవుతుంది ? ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఈ కథలో ప్రధాన పాత్ర రూబెన్ వర్కీ. సంగీత్ ప్రతాప్ (Sangeeth Prathap) ఈ పాత్రలో నటించాడు. ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదం తర్వాత రూబెన్ కోమాలోకి వెళ్తాడు. వైద్యులు అతడి మెదడు పని చేయడం లేదని భావించినా, అతను మాత్రం ఇంకా బతికే ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ చుట్టూ జరిగే విషయాలను వినగలుగుతాడు. ముఖ్యంగా, సాధారణంగా మనుషులు గుర్తించలేని చిన్న శబ్దాలు కూడా అతడికి స్పష్టంగా వినిపిస్తాయి. ఆ అసాధారణ వినికిడి శక్తే అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పుతుంది.

Advertisement

రూబెన్ కోమాలో ఉన్న సమయంలో అతడితో మాట్లాడుతుంటుంది సూసన్ అన్నా రాయ్. ఆమె ఓ నర్సు. సూసన్ మాటలు రూబెన్‌ కు బయట ప్రపంచంతో ఉన్న ఏకైక అనుబంధంగా మారతాయి. ఆమె గొంతు అతడిలో జీవించాలనే ఆశను నిలిపిందనే భావనతో, కోలుకున్న తర్వాత ఆమెను వెతకాలని రూబెన్ నిర్ణయించుకుంటాడు. అయితే రూబెన్ తిరిగి సాధారణ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా ఉండవు. అతడికి వచ్చిన అసాధారణ వినికిడి శక్తి ఒకవైపు ఉపయోగపడుతూనే, మరోవైపు ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది.

చిన్న శబ్దం కూడా అతడిని కలవర పెడుతుంది. అదే సమయంలో, కొన్ని శబ్దాలు అతడికి ముఖ్యమైన విషయాలను తెలియజేస్తే, మరికొన్ని అతడిని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు మనుషులు మనసులో ఏం అనుకుంటున్నారు అనేది అతనికి చెప్పకుండానే అర్థం అవుతుంది. మరి చివరికి హీరో ఆ నర్సు ఎవరో కనిపెట్టగలిగాడా ? ఈ క్రమంలో వచ్చే ఫన్ ఏంటి ? అతనికి వచ్చిన సూపర్ పవర్ ఎలాంటి ఇబ్బందులకు కారణం అయ్యింది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఓటీటీలో తెలుగులోనూ చూడవచ్చు

‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ అక్టోబర్ 15 నుంచి మనోరమా మ్యాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వచ్చింది. ఈ మలయాళం చిత్రాన్ని తెలుగుతో పాటు నాలుగు భాషల్లో చూడొచ్చు. సింప్లీసౌత్ (SimplySouth)లో కూడా సినిమాను చూడవచ్చు. అసాధారణ శక్తులు, మిస్టరీ, దర్యాప్తు, ఉత్కంఠ కలిసిన కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. వీకెండ్ కు ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి సరదాగా ఈ సినిమాను చూడవచ్చు.

Related News

ఫ్రెండ్స్‌తో కలిసి కేఫ్‌ మొదలుపెడితే… మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని గుర్తుచేసే మలయాళం కామెడీ సిరీస్ తెలుగులో

బంగారు లాకెట్‌తో మొదలైన చిక్కులు… కోర్టును షేక్ చేసే మత్స్యకారుడి పోరాటం… ఓటీటీలో తెలుగులో ఎమోషనల్ డ్రామా

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

Big Stories

Advertisement
×