Jagame Sangeetham Trailer:ఇప్పటి వరకు ఎన్నో మ్యూజికల్ డ్రామాలు వచ్చి అలరించగా తాజాగా‘జగమే సంగీతం’ అనే మరో మ్యూజిక్ డ్రామా ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయిపొయింది. అమెజాన్ ప్రైమ్ నుండి ఒరిజినల్ సిరీస్ గా రాబోతున్న ఈ ‘జగమే సంగీతం’ నుండి తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ లో ఇందులో ప్రధానంగా కర్నాటక సంగీతం తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, పర్సనల్ ఇడెంటిటీ వంటి అంశాల చుట్టూ దీన్ని తెరకెక్కించారని అర్థమవుతుంది.
ఇక ఎనిమిది ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మించగా , కరెంట్, 18 పేజెస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించడం విశేషం.’బందిష్ బాండిట్స్’ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెరకెక్కించిన ఈ మ్యూజికల్ డ్రామాకి వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ లు రచయితలుగా పని చేయగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ డ్రామాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి వంటి స్టార్స్ నటించడంతో ఈ మ్యూజికల్ డ్రామా రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.ఇక వీరితో పాటు సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘుబాబు, రాకెట్ రాఘవ వంటి తారలు కీలక పాత్రల్లో కనిపించడం విశేషం.
ట్రైలర్ మొదలవడమే “ఇదే మన వైకుంఠపురం.. ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది”అంటూ తణికెళ్ల భరణి వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.ఇక ఆ తర్వాత “స్వచ్ఛమైన సంగీతమే నా ఉచ్ఛ్వాసం.. నిశ్వాసం”అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పడం బట్టి చూస్తె ఈ డ్రామాలో ఆయనెంత సీరియస్ రోల్ పోషిస్తున్నాడో అర్థమవుతుంది. సంగీతాన్ని కేవలం కళగా కాకుండా కుటుంబ వారసత్వంగా భావించే శాస్త్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటన ఈ సిరీస్ కి మెయిన్ ఎసెట్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ సిరీస్ కి దర్శకత్వం వహించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. జగమే సంగీతం అనేది జీవితంలో ప్రేమ, కోరిక,ఆశ,ప్యామిలీ ఎమోషన్స్ ..ఇలా అన్నింటిని సంగీతం ద్వారా చెప్పే ఒక మంచి ప్రయత్నం అని, దీనికి విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన సంగీతం పాత్రల ఎమోషన్స్ ని కలిపే ఒక బ్రిడ్జ్ లా నిలిచిందని చెప్పుకొచ్చారు.
ఇక లీడ్ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ శాస్త్రి పాత్ర తనను బాగా ఆకర్షించిందని తెలిపారు. అతని క్రమశిక్షణ వెనుక అహంకారం కంటే తన కుటుంబ సంగీత వారసత్వాన్ని కోల్పోతాననే భయమే ఎక్కువగా ఉందని చెప్పారు. మధుబాల మాత్రం ప్రతి కుటుంబంలో ఉండే ప్రేమ, అపార్థాలు, త్యాగాలను ఈ సిరీస్ సున్నితంగా చూపిస్తుందని తన మనసులోని మాటల్ని చెప్పుకొచ్చారు .
మొత్తానికి ‘జగమే సంగీతం’ ట్రైలర్‌లో చూస్తుంటే మనసుని హత్తుకునే సంగీతంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ సాలిడ్ గా ఉండబోతున్నాయని అర్థం అయింది. చూడాలి మరి సెప్టెంబర్ 4 న వరల్డ్ వైడ్ గా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో స్ట్రీమింగ్ కానున్న సిరీస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో !