E-Paper
Advertisement

ఇదేం ఖర్మరా బాబు… షార్క్స్ ఒకవైపు… మాఫియా మరోవైపు… సీట్ ఎడ్జ్ అండర్ వాటర్ సర్వైవల్ థ్రిల్లర్

ఇదేం ఖర్మరా బాబు… షార్క్స్ ఒకవైపు… మాఫియా మరోవైపు… సీట్ ఎడ్జ్ అండర్ వాటర్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Shark Thriller: సముద్రంలో సరదాగా షార్క్ డైవింగ్‌కు వెళ్లిన ఐదుగురు ఫ్రెండ్స్‌… కింద షార్క్స్, పైన గన్స్‌తో మాఫియా గ్యాంగ్ ఎదురైతే ? మెక్సికో తీరంలో మొదలైన ఓ అడ్వెంచర్ ట్రిప్, సముద్రం అడుగున దొరికిన కార్టెల్‌కు చెందిన కొకైన్ బ్యాగ్‌తో ఒక్కసారిగా ప్రాణాల కోసం పోరాటంగా మారుతుంది. పైకి వస్తే గ్యాంగ్‌స్టర్లు, కింద ఉంటే గ్రేట్ వైట్ షార్క్స్.. మరోవైపు ఆక్సిజన్ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంటే ? ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల చుట్టూ సాగే అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ ‘Above and Below’. మరి ఆ కొకైన్ బ్యాగ్ వాళ్లకు ఎలా దొరికింది ? మాఫియా వాళ్లను సముద్రంలోనే ఎందుకు బంధించారు ? షార్క్స్, గ్యాంగ్‌స్టర్ల నుంచి ఒకేసారి తప్పించుకోవడం సాధ్యమైందా ? తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

మెక్సికో తీర ప్రాంతానికి ఐదుగురు స్నేహితులు షార్క్ డైవింగ్ కోసం వెళ్తారు. మొదట అంతా సరదాగా సాగుతుంది. కానీ సముద్రం అడుగుకు వెళ్లిన తర్వాత వాళ్లకు ఓ బ్యాగ్ కనిపిస్తుంది. అది సాధారణ బ్యాగ్ కాదు… కార్టెల్‌కు చెందిన కొకైన్ బ్యాగ్. ఆ బ్యాగ్ దొరకడంతోనే వాళ్ల వెకేషన్ మొత్తం తలకిందులవుతుంది. ఇంతలో డ్రగ్స్ కోసం వచ్చిన క్రిమినల్స్ వాళ్లను అడ్డుకుంటారు. పైకి వస్తే మాఫియా చేతుల్లో ప్రమాదం… కింద ఉంటే చుట్టూ తిరుగుతున్న గ్రేట్ వైట్ షార్క్స్. దీంతో వాళ్లు ఉన్న షార్క్ కేజ్ రక్షణగా కాకుండా జైలుగా మారిపోతుంది.

Advertisement

టాటియానా, కేలీతో పాటు మిగతావారిని కార్టెల్ గ్యాంగ్ బలవంతంగా సముద్రం అడుగుకు పంపిస్తుంది. అక్కడున్న డ్రగ్స్ బ్యాగ్‌ను తీసుకురావాలని ఆదేశిస్తుంది. కానీ బ్యాగ్ ఉన్న ప్రాంతం చుట్టూ షార్క్స్ తిరుగుతుంటాయి. కేజ్ బయటకు వెళ్లిన ప్రతిసారీ ప్రాణాపాయం. మరోవైపు ఆక్సిజన్ కూడా తగ్గిపోతుండటంతో ఎక్కువసేపు నీటిలో ఉండే పరిస్థితి లేదు.

ఇప్పుడు వాళ్ల ముందున్నది రెండు దారులే. పైకి వెళ్తే గన్స్‌తో ఎదురుచూస్తున్న గ్యాంగ్… కిందికి వెళ్తే షార్క్స్. ఈ పరిస్థితుల్లో టాటియానా మాత్రం భయపడకుండా తన ఫ్రెండ్స్‌ను కాపాడేందుకు ప్లాన్ చేస్తుంది. మాఫియా వాళ్లను మోసం చేసి బయట పడటంతో పాటు షార్క్స్ నుంచి కూడా తప్పించుకోవాలి. ప్రతి క్షణం ఆక్సిజన్ తగ్గిపోతుండటంతో టెన్షన్ పెరుగుతుంది. అసలు ప్రమాదం సముద్రంలోని షార్క్సా ? లేక తుపాకులతో ఎదురు చూస్తున్న క్రిమినల్సా ? చివరికి టాటియానా తన తెలివితేటలు, ధైర్యంతో ఈ రెండు ప్రమాదాలను ఎలా ఎదుర్కొంది ? ఫ్రెండ్స్‌ను కాపాడుకుని సముద్రం నుంచి బయట పడగలిగారా? అనేదే అసలు సస్పెన్స్.

తెలుగులో ఉందా లేదా ?

Advertisement

ఆంటోనియో బాండెరాస్, లారా మరానో, క్రిస్టినా ఓచోవా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ క్రైమ్ సర్వైవల్ థ్రిల్లర్‌కు జెస్సీ వి. జాన్సన్ దర్శకత్వం వహించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 36 నిమిషాలు. షార్క్స్, అండర్‌వాటర్ సర్వైవల్, క్రైమ్, యాక్షన్ కలిసిన థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ప్రస్తుతం Prime Videoలో రెంట్ కి అందుబాటులో ఉంది. కానీ తెలుగులో మాత్రం స్ట్రీమింగ్ కావడం లేదు.

Read Also: కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×