OTT Movie : బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటినుంచి ఈ ఇండస్ట్రీ టాప్ లోనే నడిచింది. ఇప్పుడు సౌత్ కూడా వీటికి ధీటుగా గట్టి పోటీ ఇస్తోంది. అయినా కూడా బాలీవుడ్ సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా అభిమానిస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే బాలీవుడ్ మూవీ ఒక కారు ప్రమాదం చుట్టూ నడుస్తుంది. ఈ మూవీలో విద్యా బాలన్ తన నటనతో అందరినీ మెప్పించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చివరి వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో
ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘జల్సా’ (Jalsa). 2022 లో విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీకి సురేష్ త్రివేణి దర్శకత్వం వహించారు. ఇందులో విద్యా బాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ హిట్-అండ్-రన్ ఘటన చుట్టూ తిరుగుతుంది.
స్టోరీలోకి వెళితే
మాయా మీనన్ ఒక ప్రముఖ టీవీ జర్నలిస్ట్ గా ఉంటూ, ‘ఫేస్ ది ట్రూత్’ అనే షోను నడుపుతుంది. ఆమె నీతి, నిజాయితీకి మారుపేరు గా ఉంటుంది. ఆమె తన తల్లితో పాటు కొడుకు ఆయుష్ తో కలసి నివసిస్తుంది. ఆమె ఇంట్లో రుక్సానా అనే కేర్‌టేకర్ పనిచేస్తుంది. ఆమెకూడా మాయా కుటుంబంలో ఒక భాగంలా మారిపోతుంది. ఒక రాత్రి మాయా పని నుండి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఆమె డ్రైవర్‌ను ఇంటికి పంపేసి, స్వయంగా కారు నడుపుతూ ఇంటికి వెళ్తుంది. అయితే అలసటతో ఉన్న ఆమె ఒక 18 ఏళ్ల అమ్మాయిని కారుతో ఢీకొట్టి పారిపోతుంది. ఆ బాధితురాలు రుక్సానా కూతురు అలియా అని తర్వాత తెలుస్తుంది. ఈ ఘటన మాయా జీవితంలో ఒక పెను మార్పును తీసుకొస్తుంది. అ తరువాత ఆమె తన నేరాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో, రుక్సానా కూతురు రాత్రి బయట ఎందుకు ఉంది అనే గందరగోళంలో పడుతుంది.
పోలీసుల విచారణలో అలియా ఆ రాత్రి ఒక అబ్బాయితో కలిసి ఉందని, అతను ఆమెపై శారీరకంగా దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె పారిపోతూ ఈ ప్రమాదంలో చిక్కుకుందని తెలుస్తుంది. మాయా బాధపడుతూనే అలియాను ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలిస్తుంది. కానీ రుక్సానాకు ఈ విషయం తెలియకుండా దాచడానికి ప్రయత్నిస్తుంది. కథ చివరిలో, మాయా తన తప్పును ఒప్పుకుని రుక్సానాతో అసలు విషయం చెప్పేస్తుంది. అయితే ఈ ప్రమాదంలో అలియా బతికే ఉంటుంది. చివరికి ఒక సంతోషకరమైన శుభం కార్డ్ ఈ మూవీకి కూడా పడుతుంది. ఈ మూవీలో విద్యా బాలన్, షెఫాలీ షా నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీని మీరుకూడా చూడాలి అనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో సిద్ధంగా ఉంది.