BigTV English

Netflix Upcoming Movies : నెట్ ఫ్లిక్స్‌లో సినిమాల జాతర… 6 సినిమాలు ఒకే రోజు… డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్

Netflix Upcoming Movies : నెట్ ఫ్లిక్స్‌లో సినిమాల జాతర… 6 సినిమాలు ఒకే రోజు… డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్
Advertisement

Netflix Upcoming Movies : నెట్‌ఫ్లిక్స్ సంస్థ అదిరిపోయే కంటెంట్ ఉన్న సిరీస్ లను, సినిమాలను తొందర్లోనే స్ట్రీమింగ్ కి తేనుంది. వీటిలో తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తం 6 కొత్త ఒరిజినల్స్ ను, ఒకే రోజు అనౌన్స్ చేసి, సౌత్ కంటెంట్‌ కు బూస్ట్ ఇస్తోంది. ఇందులో సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్), స్టెఫెన్ (తమిళ థ్రిల్లర్), తక్షకుడు (తెలుగు థ్రిల్లర్), లెగసీ (గ్యాంగ్‌స్టర్ స్టోరీ), #లవ్ (తమిళ రొమాంటిక్ సిరీస్), మేడ్ ఇన్ కొరియా లాంటి స్టోరీలు ఉన్నాయి. వీటి రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కాకపోయినా, ఇప్పటినుంచే ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అవుతోంది. వీటి గురించి మరిన్ని డీటైల్స్ తెలుసుకుందాం.


1. ‘సూపర్ సుబ్బు’ (తెలుగు కామెడీ సిరీస్)

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ (సుబ్బు) మెయిన్ రోల్ లో నటిస్తున్నారు. ఈ కథ సుబ్బు అనే ఒక యువకుడు, ఒక మారుమూల విలేజ్‌లో సె*క్స్ ఎడ్యుకేషన్ టీచ్ చేయాల్సి వస్తుంది. దీంతో అసలు కథ మొదలవుతుంది. అతను మొదట దీనిని హ్యాండిల్ చేయలేక పోతాడు. తరువాత ఫన్నీ సిట్యువేషన్స్ ఫేస్ చేస్తాడు. కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. చివరికి అతను తనదైన స్టైల్ అందరికీ చెప్తాడు. ఇది చివరికి ఒక సోషల్ మెసేజ్ ని ఇస్తుంది. సందీప్ కిషన్ కామెడీ టైమింగ్, మల్లిక్ రామ్ ఫ్రెష్ డైరెక్షన్ తో నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం.

2. ‘తక్షకుడు’ (తెలుగు థ్రిల్లర్ మూవీ)

వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, నితాంషి గోయెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తక్షకుడు అనే వ్యక్తి కి జరిగిన అన్యాయానికి రివేంజ్ తీర్చుకునే క్రమంలో ఈ కథ నడుస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. చేతిలో గన్ పట్టుకున్న పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. లాపటా లేడీస్ ఫేమ్ నితాంషి గోయెల్ కూడా నటిస్తుండటంతో దీని కోసం థ్రిల్లర్ ఫ్యాన్స్‌ ఎక్సైటింగ్ చూస్తున్నారు. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.


3. ‘స్టెఫెన్’ (తమిళ సైకలజికల్ థ్రిల్లర్ మూవీ)

మిథున్ దర్శకత్వంలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ కథ లో స్టెఫెన్ అనే వ్యక్తి కిల్లర్ గా మైండ్ గేమ్ ప్లే చేస్తాడు. కథ ఊహించని ట్విస్టులతో ఉంటుంది. సైకలజికల్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు ఇది పర్ఫెక్ట్.

4. లెగసీ (గ్యాంగ్‌ స్టర్ సిరీస్)

ఆర్. మాధవన్, నిమిషా సజయన్, గౌతం కార్తిక్, గుల్షన్ దేవయ్య, అభిషేక్ బానర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ గ్యాంగ్‌ స్టర్ సిరీస్ కి చారుకేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథ పెరియవర్ (ఆర్. మాధవన్) అనే మాఫియా లీడర్ తన ఎంపైర్ ను సేవ్ చేయడానికి, ఒక వారాసుడి కోసం ఎవరూ సాహసం చేయని ఒక రిస్క్ తీసుకుంటాడు. మాధవన్ ఇందులో ఒక న్యూ లుక్‌తో మాఫియా రోల్ ని పోషిస్తున్నాడు.

5. #లవ్ (తమిళ రొమాంటిక్ సిరీస్)

బలాజీ మోహన్ దర్శకత్వంలో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ఇందులో నటిస్తున్నారు. కథ తారా అనే స్టార్టప్ ఫౌండర్, మ్యాథ్యూ అనే ఇన్వెస్టర్ మధ్య రొమాన్స్ నడుస్తుంది. మోడరన్ లవ్ స్టోరీ ఫ్యాన్స్‌కు ఇదొక ఫ్రెష్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు.

6. మేడ్ ఇన్ కొరియా (తమిళ డిస్కవరీ మూవీ)

కార్తిక్ దర్శకత్వంలో ప్రియాంక మోహన్, పార్క్ హ్యే-జిన్ (స్క్విడ్ గేమ్ ఫేమ్) ఇందులో నటిస్తున్నారు. ఈ కథలో షెంబా అనే తమిళ అమ్మాయి, తన బాయ్‌ ఫ్రెండ్‌తో కొరియా ట్రిప్ ప్లాన్ చేస్తుంది, కానీ ఒక కుట్రలో చిక్కుకుంటుంది. ఆమె సియోల్ లో ఒంటరిగా, సమస్యలను ఫేస్ చేస్తుంది. ప్రియాంక మోహన్ ఇందులో ఒక స్ట్రాంగ్ రోల్ ని ప్లే చేస్తోంది.

 

Read Also : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

 

Related News

OTT Movie : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా

OTT Movie : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

OTT Movie : మాంసం కొట్టు యజమాని మర్డర్… ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కన్నడ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : చెరువులో మనిషి పుర్రె… మర్డర్ మిస్టరీలో మతిపోగోట్టే ట్విస్టులు… టెన్షన్ పెట్టే ఇంటెన్స్ మలయాళ థ్రిల్లర్

Jr.NTR Dragon OTT : ఓటీటీ లవర్స్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్… డ్రాగన్‌తో అంత ఈజీ కాదు

Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడేనా?

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×