OTT Movie : మలయాళం సినిమాలను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు ఈ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ఈయన నటించిన ఒక మూవీ బాక్సాఫీస్ హిట్ కొట్టింది. అందులో హీరో నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (Youtube) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘Njan Prakashan’. దీనికి సత్యన్ అంతిక్కాట్ దర్శకత్వం వహించగా, శ్రీనివాసన్ రచన చేశారు. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది ఒక సాధారణ మనిషి జీవితంలోని ఆశలు, కలలు, వాస్తవికతను చక్కగా చిత్రీకరించే కథ ఈ మూవీ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధించింది. ఇది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మలయాళం మూవీ యూట్యూబ్ (Youtube) లో ఫ్రీగానే చూడవచ్చు
స్టోరీలోకి వెళితే
ప్రకాశన్ అనే యువకుడు కేరళలోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తాడు. అతను తన పేరు కాస్త ఓల్డ్ స్టైల్ లో ఉంటుందని భావించి, కొత్తగా ఉండేందుకు P. R. అకాశ్ అని మార్చుకుంటాడు. ప్రకాశన్ ఒక నర్సుగా అర్హత సాధించినప్పటికీ, ఆ వృత్తిని తక్కువగా చూస్తాడు. అతనికి నర్సింగ్ అనేది తక్కువ జీతం, గౌరవం లేని పనిగా అనిపిస్తుంది. ఇది స్త్రీలకు మాత్రమే సరిపోతుందనే భావన కలిగి ఉంటాడు. అతని ప్రధాన లక్ష్యం విదేశాలకు వెళ్లి, అక్కడ ఉన్నతమైన జీవితాన్ని గడపడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, అతను తన మాజీ ప్రియురాలైన సలోమిని తిరిగి కలుస్తాడు. సలోమి ఒక నర్సు కావడంతో, ఆమెను వివాహం చేసుకుని, ఫ్యామిలీ వీసా పొంది విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఆమెను విడిచిపెట్టి తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలనేది అతని అసలైన ఆలోచన. కానీ సలోమి అతన్ని తిరస్కరిస్తుంది. దీంతో అతని ప్లాన్ విఫలమవుతుంది.
ఆ తర్వాత ప్రకాశన్ గోపాల్ జీ అనే ఒక బిజినెస్ వుమెన్ ను కలుస్తాడు. ఆమెకు టీనా అనే ఒక కూతురు ఉంటుంది. ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. గోపాల్ జీ తన కూతురిని చూసుకోవడానికి ప్రకాశన్‌ను పనిలో పెట్టుకుంటుంది. ఈ పాత్రలో ప్రకాశన్ టీనాతో గడిపే సమయం అతని జీవితంలో ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. టీనా ఒక రోజు అనూహ్యంగా మరణిస్తుంది. ఈ సంఘటన ప్రకాశన్ పై గట్టి ప్రభావం చూపుతుంది. అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతను ఒక సున్నితమైన, బాధ్యతాయుతమైన వ్యక్తిగా తయారవుతాడు. చివరికి ప్రకాశన్ నర్సింగ్ వృత్తిని స్వీకరించాడా? అసలు అనారోగ్యంతో బాధ పడుతున్న అమ్మాయి మృతితో హీరో ఇంతగా మారడానికి గల కారణం ఏంటి? చివరికి ప్రకాశన్ ఏం చేశాడు? అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.