BigTV English

OTT Movie : ఊరికి వింత శాపం… విరూపాక్ష లాంటి అదిరిపోయే గుజరాతీ హార్రర్ థ్రిల్లర్

OTT Movie : ఊరికి వింత శాపం… విరూపాక్ష లాంటి అదిరిపోయే గుజరాతీ హార్రర్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో రకరకాల సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు వీటిని చూడటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. నచ్చిన సినిమాలను, దొరికిన సమయంలో చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు.  అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక మంత్రగత్తె చుట్టూ తిరుగుతుంది. చివరివరకూ  ఈ మూవీ ఆసక్తికరంగా సాగిపోతుంది. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుని, ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  ఈ హారర్ కామెడీ మూవీ పేరు ఏమిటి ?  ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే  వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

రాణీవాడ గ్రామంలో ఝమ్‌కుడి అనే శక్తివంతమైన మంత్రగత్తె శాపం కారణంగా, అనేక సంవత్సరాలుగా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. ఈ శాపం వల్ల గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సమయంలో, గర్బా నృత్యం చేయడం కూడా  ఆ మంత్రగత్తె వళ్ళ మానుకున్నారు ఆ గ్రామస్తులు. ఎందుకంటే గర్బా నృత్యం ఆడితే, ఝమ్‌కుడి తిరిగి గ్రామంలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తుందని భయపడుతుంటారు గ్రామస్తులు. ఈ క్రమంలో కుముద్ అనే అమ్మాయి, నవరాత్రి దుర్గాదేవి తొమ్మిది రూపాలను (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి) పూజించడానికి ప్రయత్నిస్తుంది. 


కుముద్ అనే అమ్మాయి, గ్రామంలోని రాజవంశానికి చెందిన వారసురాలు, తన గ్రామాన్ని ఈ శాపం నుండి విముక్తి చేయాలనే సంకల్పంతో తిరిగి వస్తుంది. ఆమెతో కలిసి వచ్చిన బబ్లో అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఈ సమయంలో కూడా స్వార్థపూరిత లాభాల కోసం గ్రామంలో భూములు అమ్మాలని పథకాలు వేస్తుంటాడు.  ఈ క్రమంలో వీరిద్దరూ ఝమ్‌కుడి భయానక శక్తులను ఎదుర్కొంటూ, గ్రామాన్ని రక్షించే ప్రయత్నంలో ఒకరికొకరు సహకరించుకుంటారు.  ఈ ప్రయాణంలో  భయం, ఎమోషన్స్ తో వీళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. చివరికి కుముద్ ఈ గ్రామానికి శాప విముక్తిని కలిగిస్తుందా ? గర్బా నృత్యం ఆ గ్రామస్తుల మళ్ళీ ఆడతారా ? మంత్రగత్తె ఆ గ్రామానికి శాపం ఎందుకు పెడుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ గుజరాతీ హారర్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : పెళ్లికాకుండా ప్రెగ్నెంట్ అయ్యే అమ్మాయిలు… మైండ్ బ్లాక్ య్యే సైకలాజికల్ థ్రిల్లర్

 

షీమరోమ్  (shemaroome) లో

ఈ గుజరాతీ హారర్ కామెడీ మూవీ పేరు ‘ఝమ్‌కుడి’ (Jhamkudi). 2024 లో వచ్చిన ఈ సినిమాకి ఉమంగ్ వ్యాస్ దర్శకత్వం వహించగా, హీత్ భట్ దీనిని రచించారు. ఇందులో మానసి పరేఖ్, విరాజ్ ఘేలానీ, సంజయ్ గొరాడియా, ఓజాస్ రావల్, చేతన్ దయ్యా తదితరులు నటించారు. ఈ మూవీకి పార్థివ్ గోహిల్, మానసి పరేఖ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీని రూపమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పంపిణీ చేసింది. ఈ మూవీ షేమ రూమ్  (shemaroome) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×