BigTV English

MLC Kavitha: నెక్స్ట్ సీఎం మీరే..! ఎమ్మెల్సీ కవితకు సోది జోస్యం

MLC Kavitha: నెక్స్ట్ సీఎం మీరే..! ఎమ్మెల్సీ కవితకు సోది జోస్యం

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు. ఇందుకు ఆమె వరుసగా చేస్తున్న కామెంట్స్, ఆమె వ్యవహార శైలి అని చెప్పొచ్చు. సొంత పార్టీలోనే తనకు సపోర్ట్ దొరకడం లేదన్నట్లుగా మాట్లాడడంతో ఏదో జరుగుతోందన్న వాదన పెరుగుతోంది. ఇలాంటి టైంలోనే ములుగులో జరిగిన ఘటన మరింత ఇంట్రెస్టింగ్‌‌గా మారింది.


ఎమ్మెల్సీ కవితకు ఎరుకుల నాంచారమ్మ సోది జోస్యం

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుపురంలో జరిగిన ఎరుకల నాంచారమ్మ జాతరకు ఆమె హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుకల నాంచారమ్మలు కవిత చేయి చూసి సోది జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో మీరు సీఎం అవుతారంటూ ఎమ్మెల్సీ కవితకు ఎరుకుల నాంచారమ్మ సోది జోస్యంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఆ మాటలకు కవిత కూడా మూరిసిపోయారు. అక్కడున్న కార్యకర్తలంతా జై కవితమ్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబురపడ్డారు.


నెక్స్ట్ సీఎం మీరే అంటూ సోది అమ్మ జోస్యం

మరోవైపు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న నాపై.. సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని దుష్ఫ్రాచారం చేస్తున్నారని.. వారెవరో నాకు తెలుసని.. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఆమె సీఎం అంటూ సోది అమ్మ జోస్యం చెప్పడాన్ని ఆమె అనుచరులు కొందరు బీఆర్ఎస్ నేతలు తెగ వైరల్ చేస్తుండటంతో మరింత హీట్ రేపుతోంది.

సీఎం కోరికను కవితే పరోక్షంగా బయట పెట్టిందా?

సీఎం కోరికను కవితే పరోక్షంగా బయట పెట్టిందా? లేకుంటే నిజంగానే ఆమెకు సీఎం కావాలన్న కోరిక ఉందా? రాబోయే ఎన్నికలే టార్గెట్‌‌గా ఆమె అడుగులు వేస్తున్నారా? అనే చాలా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇదే టైంలో కవిత త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నారా అన్నది కూడా పొలిటికల్ గా ప్రచారం జరుగుతోంది.

మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది..

మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది.. సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత వాఖ్యలతో దుమారం మొదలైంది. అంతేకాదు రైతు బంధు, కౌలురైతు విషయంలో చేసిన వాఖ్యలపై కవితకు కౌంటర్లు వచ్చాయి. పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ నినాదంపై కవితకు సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తప్పుడు ప్రచారంపై పార్టీ స్పందిస్తుందనుకుంటున్నానన్న కవిత

మరోవైపు కవిత తీరుతో పార్టీకి నష్టం జరిగేలా ఉందని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిన్న మీడియా తో చిట్ చాట్‌లో కూడా కవిత హాట్ కామెంట్స్ చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని.. తనపై దుష్ప్రచారం జరుగుతోంది. ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసంటున్నారు కవిత. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా… ఇంకా తనను కష్టపెడతారా? అంటున్నారు ఆమె. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని.. తప్పుడు ప్రచారంపై పార్టీ స్పందిస్తుందనుకుంటున్నానన్న కవిత అంటున్నారు.

Also Read: రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు సృష్టించాం: సీఎం రేవంత్

బీఆర్ఎస్ పార్టీ వర్గపోరు కొనసాగుతున్న చర్చ జోరుగా సాగుతోంది

ఇది ఇలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గపోరు కొనసాగుతున్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. హరీశ్ వర్సెస్ కేటీఆర్ మధ్య ఇంటర్నల్‌‌ ఫైట్ నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మొన్నటి ఎల్కతుర్తి మీటింగ్‌‌లో హరీశ్ రావు ఫోటో లేకుండా చేశారన్న ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో సడన్‌‌గా ఎమ్మెల్సీ కవిత జోస్యం చెప్పించుకోవడం.. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారని సోది చెప్పడంతో పొలిటికల్ హీట్ రేపినట్లు అయ్యింది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×