OTT Movie : ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. నచ్చిన సినిమాలను చూసుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఎటువంటి సినిమా చూడాలన్నా, ఎక్కడికీ పోకుండా ఉన్న చోటునే చూడగలుగుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ఒక జంట ప్రేమలో మునుగుతుంటారు. కానీ ఆ ప్రేమ వెనుక ఒక దారుణమైన కుట్ర ఉంటుంది. ఈ తమిళ థ్రిల్లర్ సినిమాలో ట్విస్ట్ లు ఎక్కువగానే ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
సరవణన్ (మైఖేల్ తంగదురై), మగిళనీల (కవిప్రియ మనోహరన్) ప్రేమలో ఉంటారు. కానీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. వారి జీవితంలో మెరుగైన భవిష్యత్తు కోసం, మగిళనీల ఒక కొత్త ఊరిలో ఎక్కువ సంపాదన ఉన్న ఉద్యోగంలో చేరుతుంది. ఆమె ఒక హిల్ స్టేషన్‌లో వృద్ధ మహిళ వలర్మతిని చూసుకసుకుంటూ ఉంటుంది. సరవణన్ వ్యాపార కలలను నెరవేర్చడానికి, ఆ డబ్బు ఉపయోగపడుతుందని అనుకుంటుంది మగిళనీల. అయితే ఆమెకు కొత్త ఉద్యోగ స్థలంలో, వింత అనుభవాలు మొదలవుతాయి. ఫోన్ సిగ్నల్ లేకపోవడం, ఆమెను వెంటాడే పీడకలలు భయపెట్టడం, ఆ ఇంట్లో రహస్యంగా ఒక గొలుసుతో బంధించబడిన గర్భిణీ స్త్రీ ఉండటం వంటివి ఆమెను భయాందోళనకు గురిచేస్తాయి.
ఈ సమయంలో మగిళనీల గర్భవతి అని తెలుస్తుంది. అయితే ఆమె ఎవరితో కలవకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది. వాస్తవానికి సరవణన్ కి ఒక చీకటి గతం ఉంటుంది. అతను ఒక సాధువు ఇచ్చిన వరం వలన శాశ్వత యవ్వనంతో ఉంటాడు. తన యవ్వనాన్ని కాపాడుకోవడానికి, అతను గర్భిణీ స్త్రీల నుండి రక్తాన్ని తెసుకుంటూ ఉంటాడు. దీని కారణంగానే మగిళనీలను, సరవణన్ ప్రేమిస్తున్నట్లు నాటిస్తాడు. ఆ తరువాత మగిళనీలకి సరవణన్ గురించి అసలు విషయం తెలిసిపోతుంది. చివరికి ఆమె సరవణన్ ను ఎలా ఎదుర్కుంటుంది ? ఈ భయంకరమైన పరిస్థితి నుండి మగిళనీల ఎలా బయటపడుతుంది ? కొండ ప్రాంతంలో గొలుసులతో బంధించిన మహిళ ఎవరు ? సరవణన్ మహిళల్ని ప్రెగ్నెంట్ ఎలా చేస్తున్నాడు ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ తమిళ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పోలీసులకు క్లూ ఇచ్చి మరీ దొంగతనం… ఈ మలయాళ హీస్ట్ థ్రిల్లర్ లో ట్విస్టులకు మతి పోవాల్సిందే
ఆహా (aha) లో స్ట్రీమింగ్
ఈ తమిళ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆరగన్’ (Aaragan). 2024 లో విడుదలైన ఈ మూవీకి కె. ఆర్ దర్శకత్వం వహించారు. ఇందులో తంగదురై, విప్రియ మనోహరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరి చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.