OTT Movie : కూసింత లక్ మనకు కూడా ఉంటే బాగుండు కదరా చారీ అని అప్పుడప్పుడూ చాలామందికి అన్పిస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హీరోయిన్ ని మాత్రం గంపెడంత లక్ వెంటాడుతుంది. మరి ఆ లక్ తో హీరోయిన్ ఏం చేసింది అనే విషయాన్ని స్టోరీలో తెలుసుకుందాం పదండి. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
కథలోకి వెళ్తే…
ఆష్లీ ఆల్బ్రైట్ (లిండ్సే లోహాన్) న్యూయార్క్ సిటీలోని బ్రాడెన్ & కో. పబ్లిక్ రిలేషన్స్‌లో పని చేసే ఒక యంగ్ ప్రొఫెషనల్. ఆమెను అందరూ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలుగా భావిస్తారు. ఆమె జీవితంలో ప్రతిదీ సజావుగా, అనుకున్నట్టుగా సాగుతుంది. అనుకోగానే వర్షం ఆగిపోతుంది, టైమ్ కి క్యాబ్ దొరుకుతుంది, లాటరీ టికెట్లు గెలుస్తుంది. ఇలా లక్ కారణంగా ఆమె జీవితం పూల పాన్పులా సాగుతుంది. ఆమె స్నేహితులు మాగీ (సమైర్ ఆర్మ్‌స్ట్రాంగ్), డానా (బ్రీ టర్నర్) ఆమె అదృష్టాన్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఆష్లీ తన బాస్ పెగ్గీ బ్రాడెన్ (మిస్సీ పైల్) కోసం ఒక మాస్కరేడ్ బాల్‌ను ఏర్పాటు చేస్తుం. ఇది ఒక పెద్ద క్లయింట్ అయిన రికార్డ్ మొగల్ డామన్ ఫిలిప్స్ (ఫైజన్ లవ్)ను ఆకర్షించడానికి.
మరోవైపు జేక్ హార్డిన్ (క్రిస్ పైన్) ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు. బ్రిటిష్ బ్యాండ్ మెక్‌ఫ్లై అన్‌పెయిడ్ మేనేజర్ గా పని చేస్తాడు. అతన్ని ఎప్పుడూ బ్యాడ్ లక్ వెంటాడుతుంది. అతని డెమో సీడీ డామన్ ఫిలిప్స్‌కు చేరకుండా అరెస్ట్‌లు, ప్రమాదాలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు. జేక్, మెక్‌ఫ్లైని ప్రమోట్ చేయడానికి డామన్ ను కలవాలని అనుకుంటాడు. అందుకే మాస్కరేడ్ బాల్ కు డాన్సర్ గా వెళ్తాడు. బాల్‌లో ఫార్చ్యూన్ టెల్లర్ ఆష్లీకి ఆమె అదృష్టం త్వరలో మారబోతుందని హెచ్చరిస్తుంది. ఆష్లీ, జేక్ ఇద్దరూ మాస్క్‌లు ధరించి, ఒకరినొకరు గుర్తించకుండా డాన్స్ చేస్తూ ముద్దు పెట్టుకుంటారు. ఈ ముద్దు వాళ్ళ అదృష్టాన్ని స్వాప్ చేస్తుంది. దీంతో ఆష్లీ దురదృష్టవంతురాలు అవుతుంది.
జేక్ అదృష్టవంతుడు అవుతాడు.
జేక్ డామన్ ఉం అదృష్టం వరించడంతో వెంటనే ఫాన్సీ అపార్ట్‌మెంట్‌లోకి మారతాడు. ఇక ఆష్లీ జీవితం గందరగోళంగా మారుతుంది. ఆమె ఒక వేశ్యను తన బాస్‌కు డేట్‌గా ఆహ్వానించడం వల్ల అరెస్ట్ అవుతుంది. ఉద్యోగం కోల్పోతుంది. ఆమె అపార్ట్‌మెంట్ వరదల్లో మునిగిపోతుంది. ఆమె తన స్నేహితులు మ్యాగీ, డానాతో కలిసి ఉంటుంది. దీంతో ఆష్లీ తన అదృష్టాన్ని తిరిగి పొందడానికి బాల్‌లోని ప్రతి మగ డాన్సర్‌ను ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ జేక్ డాన్సర్ కాదని తెలియదు. ఈ క్రమంలోనే ఒక డైనర్‌లో ఆమె జేక్‌ను తెలియకుండానే కలుస్తుంది. అతను ఆమెకు ఒక బౌలింగ్ అల్లీలో జాబ్ ఆఫర్ చేస్తాడు. ఇద్దరూ స్నేహితులుగా మారతారు. ఆష్లీ జేక్‌ను మాగీకి, ఒక సింగర్-సాంగ్‌రైటర్‌కు పరిచయం చేస్తుంది. ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది. హీరోయిన్ అదృష్టం తిరిగివస్తుంది. మరి అదెలా జరిగింది? హీరోయిన్ లక్ ఆమెకే తిరిగి వచ్చాక హీరో పరిస్థితి ఏంటి? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ మూవీ పేరు “జస్ట్ మై లక్” (Just My Luck). 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. దీనిని డొనాల్డ్ పెట్రీ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో లిండ్సే లోహాన్, క్రిస్ పైన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సమైర్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఫైజన్ లవ్, మిస్సీ పైల్, బ్రిటిష్ బ్యాండ్ మెక్‌ఫ్లై సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తారు. ఇండియాలో ఈ మూవీ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
Read Also : మృత్యు దేవతతో అమ్మాయి పోరాటం… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని మలుపులు