OTT Movie : చావు ఎప్పుడు, ఎలా, ఎందుకు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఊహించడమే కష్టమైన ఈ చావును ముందే తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ఓ సూపర్ పవర్ ఉన్న అమ్మాయి స్టోరీనే ఈ రోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…
కథలోకి వెళ్తే…
ఈ సినిమా కథ గ్రిమ్ రీపర్ (మరణ దూత), ఒక డిటెక్టివ్, మరణాన్ని ముందే చూడగలిగిన ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. కథ కేంద్ర బిందువు 20 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని కోల్డ్ కేస్ హత్యలను వెలికితీసే ప్రయత్నం, స్వర్గం రూల్స్ ను ఉల్లంఘించే సంఘటనలకు దారి తీస్తుంది. ఇక కథలోకివ వెళ్తే… హాన్ మూ-గాంగ్ / బ్లాక్ ఒక డిటెక్టివ్. అతన్ని గ్రిమ్ రీపర్ నంబర్ 444 (బ్లాక్) ఆవహించి ఉంటాడు. ఈ గ్రిమ్ రీపర్ తన తోటి రీపర్‌ను కనుగొనడానికి పంపుతారు. ఎందుకంటే తోటి రీపర్ స్వర్గం రూల్స్ ను పట్టించుకోకుండా పారిపోతాడు. అతను మూ-గాంగ్ శరీరంలోకి ప్రవేశించి, 20 సంవత్సరాల క్రితం జరిగిన హత్యల రహస్యాన్ని వెలికితీసే పనిలో పడతాడు.
కాంగ్ హా-రమ్ (గో ఆరా) ఒక యువతి, ఆమెకు మరణం నీడలను (గ్రిమ్ రీపర్‌లను) చూడగలిగే అసాధారణ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆమె జీవితాన్ని కష్టతరం చేస్తుంది. చనిపోయే వాళ్ళ గురించి ముందే తెలియడంతో ఆమె వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవ్వరూ వినరు. కాబట్టి ఆమె నల్ల సన్‌గ్లాసెస్ ధరిస్తుంది. అప్పుడు తనకు ఇలాంటి విషయాల్లో కాస్త కంట్రోల్ గా ఉంటుంది. ఆమె బ్లాక్‌తో కలిసి పనిచేస్తూ, చచ్చే వాళ్ళను చావకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇది స్వర్గం నియమాలకు వ్యతిరేకం.
బ్లాక్, హా-రమ్ కలిసి 20 సంవత్సరాల క్రితం జరిగిన హత్యల రహస్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో అనేక ట్విస్ట్‌లు, షాకింగ్ రివిలేషన్‌లను ఎదుర్కొంటారు. ఈ హత్యలు మూజిన్ అనే ప్రదేశంతో లింకు అయ్యి ఉంటాయి. ఇక్కడే ఊహించని సీక్రెట్స్ అన్నీ ఉంటాయి. ఇక బ్లాక్ మానవ జాతికి చెందిన అమ్మాయి రమ్ తో ప్రేమలో పడతాడు. కానీ ఇది కూడా స్వర్గం రూల్స్ ను వ్యతిరేకమే. మరి వీరిద్దరి ప్రేమ ఎక్కడికి దారి తీసింది ? 20 ఏళ్ల క్రితం చనిపోయిన కోల్డ్ కేస్ లను ఎలా పరిష్కరించారు? అసలు ఆ కేసులను ఎందుకు వెలికితీస్తున్నారు? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also : పక్కింట్లో మర్డర్, ఫ్యూజులు అవుట్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్… మెంటల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సినిమా కాదు సిరీస్. ఈ సిరీస్ పేరు ‘బ్లాక్’ (Black). 2017లో వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. ఈ డ్రామాలో సాంగ్ సీయుంగ్-హియాన్, గో ఆరా, లీ ఎల్, కిమ్ డాంగ్-జూన్ ప్రధాన పాత్రల్లో నటించారు.