Korean Skincare: ప్రస్తుత కాలంలో అందంపై ప్రతి ఒక్కరికి శ్రద్ధ పెరిగింది. అప్పట్లో జనాలకు అందంపై అంతగా.. ఇంట్రస్ట్ లేకపోయినా ఎంతో కొంత ఉండేది. కానీ మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ పరంగా ప్రతిఒక్కరికి అందంపై ఆసక్తి ఎక్కువైంది. వయసుతో సంబంధం లేకుండా.. అందంగా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం బయట మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు ఉపయోగిస్తున్నారు. బ్యూటీపార్లర్‌కి వెళ్లి వివిధ రకాల ఫేసియల్స్ చేపిస్తుంటారు. అవి టెంపరరీగా పనిచేస్తాయి తప్పా.. శాశ్వతంగా పనిచేయవు. పైగా వాటివల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కొరియన్ లాంటి చర్మ సౌందర్యం గురించి చూపిస్తున్నారు. కొరియన్ స్కిన్ చాలా స్మూత్‌గా, గ్లాసీ లుక్‌లో మెరుస్తా ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు కొరియన్ లాంటి స్కిన్ కావాలని కోరుకుంటారు. వాళ్లలాగా మీ చర్మం కూడా మెరిసిపోవాలంటే.. ఈ నాచురల్ టిప్స్ ఫాలో అవ్వండి. తక్షణమే మీకు రిజల్ట్ కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్ క్లీనర్ కోసం- పాలు, పసుపు ఫేస్ మాస్క్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ పాలు, చిటికెడు పసుపు కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మురికి, మృతకణాలు తొలగిపోయి తాజాగా ఉంటుంది.
ఫేస్ స్క్రబ్ కోసం-షుగర్, తేనె
ముందుగా చిన్న బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ పంచదార, తేనె కలిపి ముఖానికి పెట్టుకొని.. 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే.. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.
ఫేస్ టోనర్ కోసం-అలోవెరా జెల్, రోజ్ వాటర్
చిన్న గిన్నెలో అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖాన్ని శుభ్రం చేయడమే కాకుండా.. రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.
ఫేస్ మాస్క్ కోసం-అరటిపండు, తేనె
బాగా పండిన అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులాగా చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్‌గా చేసి, మృదువుగా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు ఇవి డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, మచ్చలు మొటిమలు, వృద్ధాప్య సాంకేతాలను తగ్గిస్తుంది.
ఇలా రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా రెండు వారాలకు ఒకసారి చేస్తే.. కొరియన్ లాంటి అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. వీటిలో ఉపయోగించే పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
Also Read: టీనేజ్ లవ్‌లో ఈ కొత్త ట్రెండ్ మీ పిల్లలకు ప్రమాదంగా మారిందా?
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.