Emergency OTT release : బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా తన కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’ (Emergency) ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో శుక్రవారం ఈ బ్యూటీ తన అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఈ మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘ఎమర్జెన్సీ’ ఓటీటీ రిలీజ్ డేట్
కంగనా రనౌత్ దర్శకత్వం వహించి, నటించిన మూవీ ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాను జనవరిలో సెన్సార్ బోర్డుతో జరిగిన సుదీర్ఘ పోరాటం తర్వాత థియేటర్లలో రిలీజ్ చేసింది కంగనా రనౌత్. ‘ఆజాద్’ మూవీతో పోటీగా రిలీజ్ అయిన ‘ఎమర్జెన్సీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం నిరాశపరిచాయి. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. మార్చ్ 17న నెట్ ఫిక్స్ (Netflix) లో ‘ఎమర్జెన్సీ’ మూవీ స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది కంగనా. ఈ మేరకు ఆమె పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. జనవరి 17న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇండియాలో కేవలం రూ. 21.65 కోట్ల గ్రాస్ ను మాత్రమే వసూలు చేయగలిగింది.
‘ఎమర్జెన్సీ’ మూవీలో కంగనా రనౌత్ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ సినిమా 1975 నుంచి 1977 వరకు ఇందిరా గాంధీ ప్రకటించిన హిస్టారికల్ మూమెంట్ ‘ఎమర్జెన్సీ’ కాలం ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ మూవీలో కంగనా మెయిన్ లీడ్ గా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించింది. ‘ఎమర్జెన్సీ’లో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించారు.
‘ఎమర్జెన్సీ’ వివాదం
‘ఎమర్జెన్సీ’ మూవీ రిలీజ్ కి ముందు ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. దీనివల్ల పలుమార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అలాగే సెన్సార్ సమస్యలు కూడా తప్పలేదు. వాస్తవాలను తప్పుగా చూపించారు అంటూ సిక్కు సంస్థలు ఈ మూవీపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. గత ఏడాది ఆగస్టులో ఈ చిత్ర నిర్మాతలకు సిక్కు సంస్థలు లీగల్ నోటీసు పంపారు. అందులో సిక్కుల పాత్ర, చరిత్రను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ, సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే అభ్యంతరకరమైన సన్నివేశాలను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. మూవీ రిలీజ్ అయ్యాక కూడా చాలా చోట్ల ఎమర్జెన్సీ ప్రదర్శనను ఆపాలంటూ థియేటర్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీతో కంగనాకు భారీ నష్టాలు తప్పలేదు. మరి ఓటీటీలో ‘ఎమర్జెన్సీ’కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మృణాల్ ఠాకూర్ రివ్యూ
‘ఎమర్జెన్సీ’ మూవీని తన తండ్రితో కలిసి చూశానంటూ ఇటీవల రివ్యూ షేర్ చేసింది మృణాల్ ఠాకూర్. అందులో ఇంకా ఎవరైనా మూవీని థియేటర్లలో చూడకపోతే తప్పకుండా చూడమని రికమెండ్ చేసింది. అంతేకాకుండా మూవీని చూశాక కన్నీళ్లతో థియేటర్ నుంచి బయటకు వస్తారంటూ కామెంట్స్ చేసింది.