BigTV English

Kishan Reddy: హీటెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy: హీటెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy:  తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య విమర్శలు తీవ్రమయ్యాయి. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకు దశ దిశ నిర్దేశిస్తాయన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు.


హీటెక్కిన ఎన్నికల ప్రచారం

మెదక్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతు లెత్తేసిందన్నారు. బీఆర్ఎస్ నేతలకు అహంకారం పెరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అధికారంలో వచ్చారన్నారు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.


బీజేపీ పాలిత రాష్టాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని మనసులోని మాట బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 14 నెలలు అవుతుందని ఏ పనులు చేయలేదన్నారు.

తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు కేంద్రమంత్రి. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని మండిపడ్డారు.

ALSO READ: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం..

ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి పనులు అన్ని కుంటుపడ్డాయని తెలిపారు. అటు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. తెలంగాణలో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు గోడమీద పిల్లుల్లా పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. బీజేపీలో ఆ సిద్ధాంతం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆభ్యర్థులను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా ఉంటామన్నారు.

మెదక్ జిల్లా బీఆర్ఎస్‌కు కోట లాంటింది. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. నేతల మాటలు చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతుందనే చెప్పవచ్చు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×