Uppu Kappurambu OTT: సుహాస్ (Suhas).. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. హీరోగా కెరియర్ మొదలు పెట్టక ముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వెలుగులోకి వచ్చాడు. ఇక కలర్ ఫోటో సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన సుహాస్.. ఆ తర్వాత హిట్ 2 వంటి చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇకపోతే ఈయన మహానటి కీర్తి సురేష్ (Mahanati Keerthy Suresh) తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సుహాస్ – మహానటి కీర్తి సురేష్ కాంబినేషన్లో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్.
సుహాస్ – కీర్తి సురేష్ మూవీకి టైటిల్ తో పాటు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా కీర్తి సురేష్ ఈ పోస్టర్ ను పంచుకుంది. తాజాగా కీర్తి సురేష్ – సుహాస్ నటిస్తున్న ఈ సినిమాకి ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ పెట్టారు. రిలీజ్ చేసిన పోస్టర్లో సుహాస్ వెంట కీర్తి సురేష్ పడుతోంది. ముఖ్యంగా ఈ పోస్టర్ చూస్తూ ఉంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమా లాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో కీర్తి సురేష్ గెటప్ కూడా చాలా భిన్నంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. కళ్ళకి అద్దాలతో కాస్త డిఫరెంట్ లుక్ లో ఆమెను చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇకపోతే ఈ ఉప్పు కప్పురంబు సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో జూలై 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి సుహాస్ – కీర్తి సురేష్ కలిసి ఏ రేంజ్ లో ఈ ఉప్పు కప్పురంబు సినిమాతో మెప్పిస్తారో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ కమెడియన్ బాబు మోహన్ (Babu Mohan) కూడా నటిస్తున్నారు.
90’స్ కథతో ఉప్పు కప్పురంబు..
ఇకపోతే 1990 నాటి బ్యాగ్రౌండ్ లో లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే ఒక విలేజ్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధిక లావు నిర్మిస్తున్నారు. వసంత్ మారింగంటి కథ రాయగా.. ఐ.వి.శశి దర్శకత్వం వహించారు. ఇక జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమాతో అటు కీర్తి సురేష్, ఇటు సుహాస్ తమ కాంబినేషన్ తో తెరపై ఎలాంటి నవ్వులు పూయిస్తారో చూడాలి.
ALSO READ:Kumari 21F Re release: మళ్లీ ఫ్యాన్స్ కి అందాల విందు.. కుమారి 21F రీ రిలీజ్ ఎప్పుడంటే?