Kumari 21F Re release:కుమారి 21ఎఫ్ (Kumari 21F).. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్ర హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) , గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebba patel) జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో కుర్ర కారును ఉర్రూతలూగించింది. ముఖ్యంగా చిట్టి పొట్టి బట్టల్లో కనిపించి, హెబ్బా పటేల్ తన గ్లామర్ తో అభిమానులకు అందాల విందు వడ్డించింది. ఈ సినిమాను మళ్ళీ తెరపై చూడాలని కోరుకునే అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా అభిమానులకు చిత్ర బృందం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు కుమారి 21ఎఫ్ సినిమా రీ రిలీజ్ కి సర్వం సిద్ధం అని చెబుతూ.. పోస్టర్ తో సహా రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది.
రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న కుమారి 21ఎఫ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇండస్ట్రీని షేక్ చేసిన లవ్ స్టోరీ కుమారి 21ఎఫ్. సినిమా జూలై 25 వ తేదీన రీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ (Sukumar) భార్య తబితా సుకుమార్ (Tabitha Sukumar) ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ విషయం తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ముఖ్యంగా హెబ్బా పటేల్ అందం, రాజ్ తరుణ్ అమాయకత్వం, దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సినిమాకి హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇందులోని కొన్ని డైలాగ్స్ సమాజం ఎలా మారింది? అని చూపించే విధంగా ఉంటాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి.
ALSO READ: Director Surender Reddy: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… ఆగిపోయిన మూవీ స్టార్ట్ అవుతుంది?
ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?
కుమారి 21ఎఫ్ సినిమా విషయానికి వస్తే.. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు సహ నిర్మాణం కూడా చేశారు. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఒక కొత్త ట్రెండును సృష్టించింది. ఇకపోతే ఇప్పటివరకు ప్రతి సినిమా కూడా క్లైమాక్స్ లో హీరో, విలన్స్ ని చంపడం మనం చూస్తాం.. జైలుకు పంపడం కూడా చూసుంటాం.. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ ఈ రెండింటికీ కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్లైమాక్స్ గురించి అప్పట్లో చర్చ కూడా నడిచింది అంటే ఏ రేంజ్ లో సుకుమార్ క్లైమాక్స్ తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఒక ఆడపిల్ల బోల్డ్ గా ఉన్నంత మాత్రాన క్యారెక్టర్ లూజ్ అయినట్లు కాదు అని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ తెలిపిన విధానం అభిమానులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. మొత్తానికి అయితే హెబ్బా పటేల్ తన అందంతోనే సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. మరి హెబ్బా పటేల్ మరొకసారి యువతకు అందాల విందు వడ్డించడానికి సిద్ధమయ్యింది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.