BigTV English

Kingdom OTT: కింగ్డమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే..ఎక్కడ చూడచ్చంటే?

Kingdom OTT: కింగ్డమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే..ఎక్కడ చూడచ్చంటే?

Kingdom OTT:ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా నటించిన చిత్రం కింగ్డమ్ (Kingdom). భారీ అంచనాల మధ్య హై ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. ప్రముఖ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. సత్యదేవ్ (Sathyadev ) విజయ్ దేవరకొండకు అన్న పాత్రలో నటిస్తూ ఉండగా.. మలయాళ నటుడు వీపీ వెంకటేష్ (VP Venkatesh) విలన్ పాత్ర పోషించారు.


కింగ్డమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే..

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యంగా టెక్నీషియన్స్, నటీనటుల రెమ్యూనరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు కలుపుకొని మొత్తం రూ.150 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చయిందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తుందని.. అప్పుడే సినిమా లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా లవర్స్ కి ఇది ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు.


నిర్మాతపై ఓటీటీ లవర్స్ ప్రశంసలు..

సాధారణంగా ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 వారాల తర్వాతనే ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ నిర్మాత నాగవంశీ కావడంతో సినిమా థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలకే ఓటీటీకి ఇవ్వడం గమనార్హం. నిజానికీ గతం నుంచి ఆయన ఓటీటీ లపై కాస్త సానుకూలంగా ప్రవర్తిస్తున్నారని, అందుకే తన సినిమాలను నాలుగు వారాలకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే చాలామంది కామెంట్లు చేశారు. దీనికి తోడు ఇప్పుడు తన సినిమాను కూడా నాలుగు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ ఇవ్వడంతో అందరూ నిజమే అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఓటీటీ మూవీ లవర్స్ కూడా నిర్మాతపై ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం.

భారీ ధరకు అమ్ముడుపోయిన కింగ్డమ్ ఓటీటీ హక్కులు..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను 50 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక మొత్తానికి అయితే సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరో నెల రోజుల్లో ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతోందని చెప్పవచ్చు.

కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్..

విజయ్ దేవరకొండ గత ఫ్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా ఈ సినిమాకు బాగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సుమారుగా రూ. 36 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, అడ్వాన్స్ సేల్స్ రూపంలో కూడా తొలిరోజే 30 వేల టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.

Related News

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

Big Stories

×