OTT Movie : తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే కొన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాలు ఎక్కువగా హారర్దా, కామెడీ జానర్ లో వస్తుంటాయి. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్ నుండి వచ్చిన హారర్ కామెడీ సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ సినిమా కాన్సెప్ట్, డార్క్ కామెడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ కథ ఒక సోఫా లో ఉండే ఆత్మతో మొదలవుతుంది. ఒక యువతిపై మోహం పెంచుకొని, ఆమె చుట్టూ ఉన్నవారిని హత్యలు చేస్తుంటుంది. ఈ కథ ఒక వైపు భయపెడుతూ, మరోవైపు నవ్విస్తూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘Killer Sofa’ బెర్నీ రావు దర్శకత్వం వహించిన న్యూజీలాండ్ హారర్ కామెడీ చిత్రం. ఇందులో పిమియో మీ (ఫ్రాన్సెస్కాగా), నాథలీ మోరిస్ (మాక్సీగా), జెడ్ బ్రోఫీ (ఇన్‌స్పెక్టర్ బాబ్ గ్రేవీగా), జిమ్ బాల్టాక్స్ (జాక్‌గా), హార్లీ నెవిల్ (ఫ్రెడెరికోగా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 అక్టోబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫ్యాండాంగో ఎట్ హోమ్, ట్యూబీ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో కి వచ్చింది.
ఈ కథ ఫ్రాన్సెస్కా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక సోఫాను కొనుగోలు చేస్తుంది. కానీ ఈ చైర్ సాధారణమైనది కాదుదానిలో డైబ్బుక్ అనే ఆత్మ ఉంటుంది. ఈ చైర్ ఫ్రాన్సెస్కాపై అనవసరమైన మోహాన్ని పెంచుకుంటుంది. ఆమెకు సంబంధించిన వ్యక్తులను, ముఖ్యంగా ఆమె సన్నిహితులను హత్య చేయడం మొదలు పెడుతుంది. ఫ్రాన్సెస్కా తన స్నేహితుడు మాక్సీ, ఆమె మాజీ ప్రియుడు జాక్ సహాయంతో ఈ సోఫా సీక్రెట్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ చైర్ గతం ఒక సైకోటిక్ డాన్సర్‌తో ముడిపడి ఉందని తెలుస్తుంది. ఈ చైర్ ఫ్రాన్సెస్కా జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇంతలో ఈ సోఫాహత్యలు పోలీసుల దృష్టిలో కూడా పడతాయి.
ఇన్‌స్పెక్టర్ బాబ్ గ్రేవీ ఈ విచిత్రమైన కేసును దర్యాప్తు చేస్తాడు. ఫ్రాన్సెస్కా ఆమె స్నేహితులు చైర్ శక్తిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ దాని అతీంద్రియ శక్తులు, ఫ్రాన్సెస్కాపై ఉన్న మోహం వాళ్ళని ప్రమాదంలో పడేస్తాయి. చివరికి ఫ్రాన్సెస్కా ఈ చైర్ నుండి తప్పించుకోవడానికి ఒక ఆధ్యాత్మిక పరిష్కారాన్ని కనుగొనాల్సి వస్తుంది. ఇది కథకు ఒక విచిత్రమైన ముగింపును ఇస్తుంది. ఈ సమస్యకు ఫ్రాన్సెస్కా ముగింపు పలుకుతుందా ? ఆ సోఫా గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ