BigTV English

OTT Movie : ఊరికి శాపం పెట్టే మంత్రగాడు… జాతర చేసుకుంటూ మనుషుల్ని చంపే దయ్యాలు

OTT Movie : ఊరికి శాపం పెట్టే మంత్రగాడు… జాతర చేసుకుంటూ మనుషుల్ని చంపే దయ్యాలు

OTT Movie : ఇండోనేషియా హారర్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగానే భయపెడతాయి. ఈ భయంకరమైన సినిమాలను ఒంటరిగా అయితే చూడలేము. ఎందుకంటే వీటిలో సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. వీటిని చీకట్లో చూస్తే పై ప్రాణాలు పైకే పోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ మూవీలో దయ్యాలు ఊరి మీద పడి మనుషుల్ని చంపుతుంటాయి. వాటిని అంతం చేయడానికి ఒక అమ్మాయిని రప్పిస్తారు. ఆ అమ్మాయిలో దయ్యం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘క్రోమోలియో’ (Kromolio). ఈ మూవీలో దయ్యాలు జాతరలా వచ్చి మనుషుల్ని చంపుతుంటాయి. ఆ దయ్యాల లీడర్ కి చాలా పవర్స్ ఉంటాయి. చేతబడిలో అన్ని విద్యలు నేర్చుకొని ఉంటాడు. వెన్నులో వణుకు పుట్టించే ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

ఒక ఊరిలో రెండు గ్యాంగుల మధ్య గొడవ జరుగుతుంది. ఈ రెండు గ్యాంగుల్లో ఒక గ్యాంగ్ లీడర్ గా మామ ఉంటే, అల్లుడు మరో గ్యాంగ్కి లీడర్ గా ఉంటాడు. అల్లుడు గ్యాంగ్ ని మామ చాలా వరకు అంతం చేస్తాడు. అల్లుడు మాత్రం చేతబడులు చేసి మంచి ప్రావీణ్యం సంపాదిస్తాడు. అతన్ని కూడా బంధించి అంతం చేయబోతయాడు. తన రక్తం చిందితే ఊరు నాశనం అవుతుందని చెప్తాడు అల్లుడు. అప్పుడు రక్తం చిందకుండా సమాధి చేస్తానని చెప్తాడు మామ. నావల్ల కాకపోయినా, నా రక్తం ఎవరిలో ఉన్నా వాళ్లు ఈ ఊరు వస్తే, ఇక్కడ ఉన్నవాళ్ళతో సహా ఊరు కూడా నాశనం అవుతుందని శపిస్తాడు. అవేమీ పట్టించుకోకుండా అతన్ని సమాధి కూడా చేస్తాడు మామ. కొంతకాలం తర్వాత తల్లి చనిపోవడంతో ఊరికి వస్తూ ఉంటుంది హీరోయిన్. తన తండ్రి చావుకి కూడా కారణం తెలుసుకోవాలనుకుంటుంది. అలా ఊర్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ తాత దగ్గరికి వస్తుంది. అప్పటినుంచి ఆ ఊరిలో ఏదో అలజడి రేగుతూ, దయ్యాలు తిరగడం మొదలుపెడతాయి.

అప్పటికే ఆ దయ్యాలు ఊరిలో ఉన్న  కొంతమందిని చంపేస్తాయి. హీరోయిన్ తాత మాత్రం ఉప్పుతో తయారుచేసిన బుల్లెట్స్ తో దయ్యాలను కాల్చి చంపుతుంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చాక తండ్రి చావుకు  వివరాలు తెలుసుకుంటుంది. తన తండ్రిని చంపింది తాత అని తెలుసుకుంటుంది. అయితే తన తండ్రికి శక్తులు ఉండటంతో అతని నాశనం చేయడం కుదరకుండా పోతుంది. కూతురు ద్వారానే తండ్రి శక్తిని అంతం చేయాలని తెలుసుకుంటాడు తాత. అందుకే హీరోయిన్ ను ఊరికి పిలిపిస్తాడు. చివరికి అల్లుడ్ని మామ ఎందుకు చంపాల్సి వస్తుంది? కూతురు తండ్రి శక్తిని అడ్డుకుంటుందా? వీళ్ళంతా దయ్యాలను ఎలా అడ్డుకుంటారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘క్రోమోలియో’ (Kromolio) అనే ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×