Ind vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును చీల్చి చెండాడింది టీమిండియా జట్టు. మొన్నటివరకు ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కూడా ఫామ్ లోకి వచ్చి… పాకిస్తాన్ బౌలర్లకు ( Pakisthan ) చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే… పాకిస్తాన్ పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా ( Team India ). చేజింగ్ ప్రారంభం నుంచి… చివరి వరకు దూకుడుగా ఆడిన టీమిండియా… ఎక్కడ తగ్గలేదు. చివరి వరకు విరాట్ కోహ్లీ కూడా పోరాడి… జట్టును గెలిపించాడు. సెంచరీ పూర్తి చేసుకుని టీమిండియాను గెలిపించాడు కోహ్లీ.
Also Read: Ind vs Pak: దుబాయ్ లో కుప్పకూలిన పాక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే ?
ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో 42.3 ఓవర్లలోనే… కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది రోహిత్ సేన. దీంతో ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ టీంను చిత్తు చేసింది టీమిండియా. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి కుప్పకూలింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో టాపార్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోవడంతో అతి తక్కువ స్కోరు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా… ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ టేబుల్ లో మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నమెంట్లో రెండు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచినందుకు నాలుగు పాయింట్లు సాధించింది టీమిండియా. దీంతో న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టేసి మొదటి స్థానానికి చేరుకుంది.
ఇది ఇలా ఉండగా… టీమిండియా ఆటగాళ్లలో… రోహిత్ శర్మ కెప్టెన్ గా తన పాత్ర పోషించాడు. 15 బంతుల్లో 20 పరుగులు చేసి.. అటాకింగ్ గా కనిపించాడు. కానీ… తొందరగానే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో ఒక సిక్సర్ అలాగే మూడు బౌండరీలు ఉన్నాయి. అలాగే టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గిల్… 52 బంతుల్లో 46 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. తనదైన కన్సిస్టెన్సీ ని… కొనసాగించాడు గిల్. తన 46 పరుగుల్లో.. ఏడు బౌండరీలు ఉన్నాయి. అయితే ఇక్కడ టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ అలాగే.. గిల్ ఇద్దరు కూడా క్లీన్ బౌల్డ్ అయ్యారు.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
అదే సమయంలో నాల్గవ వికెట్ కు వచ్చిన… శ్రేయస్ అయ్యార్ కూడా మరోసారి తన ఫామ్ కొనసాగించాడు. 67 బంతుల్లో దూకుడుగాడి 56 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్. ఇందులో ఐదు బౌండరీలు ఒక సిక్సర్ కూడా ఉంది. అయితే శ్రీయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి ఒక బౌండరీ కొట్టి అవుట్ అయ్యాడు. కానీ చివరికి విరాట్ కోహ్లీ.. తన ప్రయాణాన్ని కొనసాగించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.