E-Paper
Advertisement

వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ

వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ
Advertisement

Biographical Drama on OTT: ఒక మనిషికి శారీరక వైకల్యం ఉండొచ్చు.. కానీ ఆలోచనలకు, ఆశయాలకు వైకల్యం ఉండకూడదు. సమాజం చిన్నచూపు చూసినా, ప్రభుత్వ వ్యవస్థలు అడ్డంకులు సృష్టించినా తన హక్కుల కోసం పోరాడి లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచిన ఓ మహిళ కథ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీల్‌చైర్‌కే పరిమితం కావాలని చూసిన సమాజానికి తన పోరాటంతో సమాధానం చెప్పిన జూడీ హ్యూమాన్ జీవిత ప్రయాణాన్ని తెరకెక్కించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘బీయింగ్ హ్యూమన్’ (Being Heumann). నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 13 నుంచి Apple TV ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జూడీ చేసిన పోరాటం అమెరికా చరిత్రలో ఎలా నిలిచిపోయిందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

చిన్నతనంలోనే పోలియో బారిన పడటంతో జూడీ హ్యూమాన్ (రూత్ మేడ్లీ) వీల్‌చైర్‌కు పరిమితం అవుతుంది. అయితే తన వైకల్యం చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అడ్డంకి కాకూడదని భావిస్తుంది. న్యూయార్క్‌లో టీచర్‌గా పనిచేయాలనే ఆశతో ప్రయత్నించిన ఆమెకు, వైకల్యం కారణంగా లైసెన్స్ ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తారు. ఈ వివక్షను ఎదిరిస్తూ ఆమె న్యాయపోరాటం మొదలుపెడుతుంది. అలా వ్యక్తిగత హక్కుల కోసం ప్రారంభమైన ఆమె ప్రయాణం క్రమంగా వికలాంగులందరి హక్కుల కోసం జరిగే ఉద్యమంగా మారుతుంది.

Advertisement

1977లో కథ కీలక మలుపు తిరుగుతుంది. అమెరికాలో వికలాంగులకు వివక్ష నుంచి రక్షణ కల్పించే ‘సెక్షన్ 504’ నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. దీంతో జూడీ నాయకత్వంలో వంద మందికి పైగా వికలాంగుల హక్కుల కార్యకర్తలు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ భవనంలో నిరసనకు దిగుతారు. అప్పటి ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖ కార్యదర్శి జోసెఫ్ కాలిఫానో (మార్క్ రుఫెలో)పై ఒత్తిడి తెచ్చేందుకు వారు భవనాన్ని విడిచిపెట్టకుండా దాదాపు 26 రోజుల పాటు పోరాటం కొనసాగిస్తారు.

తగిన సౌకర్యాలు లేకపోయినా, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఉద్యమకారులు వెనక్కి తగ్గరు. వారి పట్టుదల, ఐక్యత చివరకు ప్రభుత్వాన్ని స్పందించేలా చేస్తాయి. ఈ చారిత్రక నిరసనలో జూడీతో పాటు ఇతర కార్యకర్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? వారి పోరాటం వికలాంగుల హక్కులకు ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. నిజ జీవిత ఉద్యమం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భావోద్వేగాలతో పాటు స్ఫూర్తిని కూడా అందిస్తుంది.

తెలుగులో ఉందా ?

Advertisement

‘బీయింగ్ హ్యూమన్’ (Being Heumann) సినిమాలో జూడీ హ్యూమాన్ పాత్రలో రూత్ మేడ్లీ నటించగా, జోసెఫ్ కాలిఫానోగా మార్క్ రుఫెలో, ఇవాన్ వైట్‌గా డైలన్ ఓబ్రియన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఆస్కార్ విజేత సియాన్ హెడర్ దర్శకత్వం వహించగా, జూడీ హ్యూమాన్ రాసిన ‘Being Heumann’ ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2 గంటల 7 నిమిషాల నిడివి ఉన్న ఈ అమెరికన్ బయోగ్రాఫికల్ డ్రామా 2026 నవంబర్ 6న థియేటర్లలో విడుదలై, నవంబర్ 13 నుంచి Apple TVలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ ఆడియోతో పాటు తెలుగు, తమిళం, హిందీ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also: 20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఊరు మొత్తాన్ని వణికించే వింత జీవులు… ఒక్క రాత్రిలోనే రక్తపాతం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై హారర్

ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్

భార్యపై దారుణ దాడి.. దొంగల పేరుతో భర్త డ్రామా.. ఈ క్రైమ్ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా!

20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ

40 ఏళ్ల బ్యాచిలర్ ఇంట్లోకి అందమైన యువతి ఎంట్రీ.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘పరివారిక్ మనోరంజన్’!

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

Big Stories

Advertisement
×