E-Paper
Advertisement

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్
Advertisement

Kiku Chiranjeevi OTT: తెలుగు సినిమాల్లో రొటీన్ కథలకు భిన్నంగా, అరుదైన వైద్య పరిస్థితిని ఆసక్తికరమైన మిస్టరీతో ముడిపెట్టి తెరకెక్కించిన చిత్రం ‘కికు చిరంజీవి’ (Kiku Chiranjeevi). పుట్టుకతోనే గుండె కుడివైపున ఉండే ఓ వ్యక్తికి పెళ్లైన మొదటి రాత్రి తర్వాత అనూహ్యమైన మార్పు వస్తే? అతని గుండె స్థానమే మారిపోవడంతో పాటు ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోతే? అసలు అతనికి ఏమైంది? ఈ వింత పరిణామాల వెనుక ఉన్న రహస్యమేంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ మెడికల్ మిస్టరీ థ్రిల్లర్ రూపొందింది. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక Ahaలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

చిరంజీవి అలియాస్ చిరు (కికు యనమల) ఒక అనాథ ఫోటోగ్రాఫర్. అతనికి పుట్టుకతోనే గుండె ఎడమవైపున కాకుండా కుడివైపున ఉండే అరుదైన ‘డెక్స్ట్రోకార్డియా’ (Dextrocardia) అనే వైద్య పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా శ్రమపడినా, ఆవేశానికి గురైనా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరోవైపు మను అలియాస్ మానస (కాశీష్ ఖాన్) పెళ్లి తర్వాత పిల్లలు వద్దనే షరతుతో చాలా పెళ్లి సంబంధాలను తిరస్కరిస్తుంటుంది. ఈ క్రమంలో అరకు పర్యటనలో అనుకోకుండా కలుసుకున్న చిరు, మను ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడతారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

Advertisement

అయితే పెళ్లైన మొదటి రాత్రి తర్వాతే అసలు కథ మొదలవుతుంది. పుట్టుకతో కుడివైపున ఉండాల్సిన చిరు గుండె ఇప్పుడు ఎడమవైపున ఉన్నట్లు వైద్య పరీక్షల్లో బయటపడుతుంది. అంతేకాదు, అతని ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు వస్తాయి. ప్రశాంతంగా ఉండే చిరు ఒక్కసారిగా వింతగా, ప్రమాదకరంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఇదే సమయంలో మాస్క్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి చిరు, మనులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతుంటాడు. మను జీవితంలోకి వచ్చిన వ్యక్తులపై కూడా అతను దాడి చేయడంతో పరిస్థితులు మరింత భయంకరంగా మారతాయి. అసలు చిరు గుండె స్థానం ఎలా మారింది? అతని ప్రవర్తనలో వచ్చిన మార్పులకు కారణమేంటి? ఈ పరిణామాల వెనుక ఏదైనా వైద్య రహస్యం ఉందా? మాస్క్ మ్యాన్ ఎవరు? చిరు, మను అతడి బారి నుంచి ఎలా బయటపడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా మిగతా కథ.

ఆహా (Aha)లో స్ట్రీమింగ్ 

ఈ సినిమాలో చిరంజీవి పాత్రలో కికు యనమల, మానసగా కాశీష్ ఖాన్ నటించారు. ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వైవా రాఘవ, రాజీవ్ రవిచంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సుమారు 119 నిమిషాల నిడివి ఉన్న ఈ తెలుగు మెడికల్ మిస్టరీ థ్రిల్లర్ 2026 ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నవంబర్ 14 నుంచి Ahaలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ

Related News

ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ

ఊరు మొత్తాన్ని వణికించే వింత జీవులు… ఒక్క రాత్రిలోనే రక్తపాతం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై హారర్

ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్

భార్యపై దారుణ దాడి.. దొంగల పేరుతో భర్త డ్రామా.. ఈ క్రైమ్ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా!

20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ

Big Stories

Advertisement
×