E-Paper
Advertisement

8 ఫాస్ట్ నమో భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రయాణికులకు ఇక పండుగే!

8 ఫాస్ట్ నమో భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రయాణికులకు ఇక పండుగే!
Advertisement

Namo Bharat Fast Trains: ఢిల్లీ–మీరట్ కారిడార్‌లో ప్రయాణించే వారికి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) అదిరిపోయే న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు నవంబర్ 16 నుంచి  ఎనిమిది ఫాస్ట్ నమో భారత్ రైలు సర్వీసులను ప్రారంభించనుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. తక్కువ స్టేషన్లలో మాత్రమే ఆగే ఈ సర్వీసులతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

ఐదు స్టేషన్లలో మాత్రమే స్టాప్‌లు

కొత్తగా ప్రవేశపెట్టే ఫాస్ట్ నమో భారత్ రైళ్లు ఢిల్లీ–మీరట్ కారిడార్‌లోని ఐదు ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి.   సరాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్, బేగంపుల్, మోదీపురంలో ప్రయాణికులు ఎక్కి, దిగే అవకాశం ఉంటుంది. అన్ని స్టేషన్లలో ఆగాల్సిన అవసరం లేకపోవడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు.

50 నిమిషాల్లోపే ప్రయాణం

Advertisement

ఈ ఫాస్ట్ రైళ్ల వల్ల ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఆనంద్ విహార్ నుంచి బేగంపుల్ వరకు కేవలం 36 నిమిషాల్లో చేరుకోవచ్చు. అటు ఘజియాబాద్ నుంచి బేగంపుల్ వరకు ప్రయాణానికి 28 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఆనంద్ విహార్ నుంచి ఘజియాబాద్ మధ్య ప్రయాణ సమయం సుమారు ఎనిమిది నిమిషాలకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. మొత్తం ఢిల్లీ–మీరట్ కారిడార్ ప్రయాణాన్ని 50 నిమిషాల లోపే పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

రద్దీ వేళల్లో అదనపు సర్వీసులు

ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడేలా కొత్త రైళ్లను ప్రత్యేక సమయాల్లో నడపనున్నారు. ఉదయం 8 గంటలకు, 8.30 గంటలకు సరాయ్ కాలే ఖాన్, మోదీపురం టెర్మినల్ స్టేషన్ల నుంచి ప్రతి దిశలో రైళ్లు బయలుదేరుతాయి. సాయంత్రం కూడా 6 గంటలకు, 6.30 గంటలకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

సాధారణ రైళ్లకు కొనసాగింపుగా..

Advertisement

ప్రస్తుతం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నడుస్తున్న సాధారణ నమో భారత్ రైళ్ల సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదు. వాటితోపాటు ఈ ఎనిమిది ఫాస్ట్ సర్వీసులు అదనంగా నడుస్తాయి. ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు ఫాస్ట్ సర్వీసా? సాధారణ సర్వీసా? అనే విషయాన్ని స్టేషన్ డిస్‌ ప్లే బోర్డులు, ప్లాట్‌ఫారమ్ ప్రకటనల ద్వారా వెల్లడించనున్నారు.

పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య

ప్రస్తుతం ఈ కారిడార్‌లో రోజుకు సుమారు 1.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదు కోట్ల మంది ప్రయాణించారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ప్రోత్సహించడం, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఈ అదనపు సర్వీసులు ఉపయోగపడతాయని NCRTC భావిస్తోంది.

Read Also: పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!

Tags

Related News

పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. ఎయిర్ ఇండియా కీలక హెచ్చరిక!

RAC విధానానికి గుడ్ బై.. రైల్వే సంచలన నిర్ణయం!

ప్రపంచం చూపు భారత్‌పైనే..టూరిస్టులను కట్టిపడేసే 10 అద్భుత ప్రదేశాలు ఇవే!

టికెట్ చెకింగ్ పేరుతో వసూళ్లు.. కిలేడీ ఆటకట్టించిన రైల్వే ఉద్యోగి!

రైలులో టికెట్ లేని ప్రయాణం.. ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య గొడవ.. రెండుగా చీలిన నెటిజన్లు!

ఇంజిన్ లేకుండానే పరుగులు.. బాబోయ్.. వందే భారత్‌లో ఇన్ని రహస్యాలా?

Big Stories

Advertisement
×