E-Paper
Advertisement

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ
Advertisement

Sandakari OTT: ఆఫీసులో బాస్ పెట్టే టార్చర్ భరించలేక ఉద్యోగం వదిలేయాలనిపించే పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. అలాంటిది అదే బాస్‌తో పెళ్లి చేసుకున్నట్లు నటించాల్సి వస్తే ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఆమె లండన్‌లో పనిచేసే కఠినమైన అధికారి అయితే, అతను ఆమె దగ్గర పనిచేసే అసిస్టెంట్ అయితే ఆ ఇద్దరి మధ్య జరిగే గొడవలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇలాంటి ఫన్నీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రమే ‘సందకారి’ (Sandakari). విమల్, శ్రియ శరణ్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సినిమా కథేంటి? ఎక్కడ చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

లండన్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో మాయ (శ్రియ శరణ్) సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటుంది. ఆఫీసులో ఆమె మాటే శాసనం. తన కింద పనిచేసే ఉద్యోగులతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ, ముఖ్యంగా తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వెట్రి (విమల్)కు చుక్కలు చూపిస్తుంటుంది. అయితే మాయ వీసా గడువు ముగియడంతో ఆమెకు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆమె ఓ విచిత్రమైన ప్లాన్ వేస్తుంది. తన అసిస్టెంట్ వెట్రితో ప్రేమలో ఉన్నానని, అతడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఇమ్మిగ్రేషన్ అధికారులకు చెబుతుంది.

Advertisement

ఈ నాటకాన్ని నిజమని నమ్మించడానికి వెట్రితో కలిసి అతడి సొంతూరికి బయలుదేరుతుంది. లండన్‌లో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన మాయకు, వెట్రి పల్లెటూరు వాతావరణం పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. అక్కడి సంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబ పద్ధతులు ఆమెకు ఇబ్బందిగా మారతాయి. మరోవైపు తన బాస్‌ను కాబోయే భార్యగా పరిచయం చేసిన వెట్రి కూడా ఆమెను కుటుంబ సభ్యుల ముందు నమ్మించడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే వాదనలు, గొడవలు నవ్వులు పూయిస్తాయి.

అయితే మొదట్లో వీసా సమస్య నుంచి బయటపడటానికే మొదలైన ఈ నాటకం క్రమంగా ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. వెట్రి కుటుంబం చూపించే ఆప్యాయత మాయలో మార్పు తీసుకొస్తుంది. అసలు ఈ నకిలీ నిశ్చితార్థం వెనుక ఉన్న నిజం బయటపడితే ఏం జరుగుతుంది? ఒకరినొకరు ఇష్టపడని ఈ బాస్‌, అసిస్టెంట్ చివరికి ప్రేమలో పడతారా? అన్నదే మిగతా కథ.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

Advertisement

ఈ సినిమాలో వెట్రి పాత్రలో విమల్, మాయగా శ్రియ శరణ్ నటించారు. వీరితో పాటు ప్రభు, సత్యన్, కె.ఆర్. విజయ, రేఖ, దేవ్ గిల్, పున్నగై పూ గీత, ఉమా పద్మనాభన్, క్రేన్ మనోహర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్. మాధేష్ దర్శకత్వం వహించగా, అమ్రేష్ గణేష్ సంగీతం అందించారు. ఈ చిత్రం 2012లో వచ్చిన మలయాళ సినిమా ‘My Boss’కు తమిళ రీమేక్. 2026 సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ‘సందకారి’ నవంబర్ 13 నుంచి మలేషియాలోని Astro OTT వేదికపై అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also: ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్

Tags

Related News

8,000 ఏళ్లుగా చావు లేకుండా బతుకుతున్న వ్యక్తి… రైలు ప్రయాణంలో బయటపడ్డ వింత ప్రేమకథ.. ఈ సినిమా ఓటీటీ ఎక్కడంటే?

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ

ఊరు మొత్తాన్ని వణికించే వింత జీవులు… ఒక్క రాత్రిలోనే రక్తపాతం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై హారర్

ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్

Big Stories

Advertisement
×