E-Paper
Advertisement

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి
Advertisement

The Gospel of Christmas OTT: పండుగ వాతావరణం మొదలైందంటే చాలు మనసును హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్, ఆధ్యాత్మిక విలువలు ఉన్న సినిమాలను చూడటానికి ఓటీటీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. హాలీవుడ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్స్, హ్యూమర్‌ను అద్భుతంగా బ్లెండ్ చేసి సినిమాలు తీయడంలో ప్రముఖ దర్శకుడు టైలర్ పెర్రీ దిట్ట. ఆయన మార్క్ మేకింగ్‌లో క్రిస్మస్ పండుగ స్పెషల్‌గా వచ్చిన ఫీల్-గుడ్ మ్యూజికల్ డ్రామా చిత్రం ‘ది గాస్పెల్ ఆఫ్ క్రిస్మస్’ (The Gospel of Christmas). Netflix (నెట్‌ఫ్లిక్స్) లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కథలోకి వెళ్తే…

ఐజాక్ ఒకప్పుడు మంచి పేరున్న R&B సింగర్. కానీ ఆ జీవితాన్ని వదిలేసి పాస్టర్‌గా మారతాడు. అతడి తండ్రి మరణించిన తర్వాత, కుటుంబానికి చెందిన పాత చర్చిని తిరిగి నిలబెట్టాల్సిన బాధ్యత ఐజాక్‌పై పడుతుంది. దీంతో భార్య రెబెక్కా, ఇద్దరు కుమారులు జాకబ్, ఎసావులతో కలిసి న్యూయార్క్‌లోని ఓ సమస్యాత్మక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లాక అసలు కష్టాలు మొదలవుతాయి. చర్చికి సభ్యులు తగ్గిపోవడంతో పాటు, దాని నిర్వహణకు డబ్బులు లేక అప్పులు పేరుకుపోతుంటాయి. మరోవైపు ఆ చర్చిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఓ వ్యాపారవేత్త కుట్రలు చేస్తుంటాడు.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో ఐజాక్‌కు ఊహించని ఆఫర్ వస్తుంది. అతడి పాత సంగీత జీవితాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చేలా భారీ పారితోషికంతో రీయూనియన్ టూర్ చేయాలని ఓ వ్యక్తి ప్రతిపాదిస్తాడు. ఆ టూర్ ద్వారా వచ్చే డబ్బుతో చర్చిని కాపాడుకోవచ్చని ఐజాక్ భావిస్తాడు. కానీ ఆ ఆఫర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. అతడి విశ్వాసాన్ని దెబ్బతీసి, చర్చిని స్వాధీనం చేసుకోవాలనేది ఆ వ్యక్తి అసలు ప్లాన్. ఒకవైపు భార్య రెబెక్కా ఇచ్చే ధైర్యం, మరోవైపు పాత జీవితంలోని ఆకర్షణలు.. ఈ రెండింటి మధ్య ఐజాక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? క్రిస్మస్ నాటికి చర్చిని కాపాడుకోగలడా? అన్నదే మిగతా కథ.

తెలుగులో చూడొచ్చా ?

ఈ సినిమాలో పాస్టర్ ఐజాక్‌గా డ్యూరెల్ ‘ట్యాంక్’ బాబ్స్, ఆయన భార్య రెబెక్కాగా ఫాంటాసియా బారినో నటించారు. దీనికి టైలర్ పెర్రీ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ప్రముఖ గోస్పెల్ సంగీత దర్శకుడు కిర్క్ ఫ్రాంక్లిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. సుమారు 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా నవంబర్ 11, 2026 నుంచి నేరుగా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు ఆడియోల్లోనూ అందుబాటులో ఉంది. కాబట్టి తెలుగులోనూ ఈ క్రిస్మస్ ఎమోషనల్ డ్రామాను చూసేయొచ్చు.

Advertisement

Read Also: 20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

8,000 ఏళ్లుగా చావు లేకుండా బతుకుతున్న వ్యక్తి… రైలు ప్రయాణంలో బయటపడ్డ వింత ప్రేమకథ.. ఈ సినిమా ఓటీటీ ఎక్కడంటే?

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ

ఊరు మొత్తాన్ని వణికించే వింత జీవులు… ఒక్క రాత్రిలోనే రక్తపాతం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై హారర్

Big Stories

Advertisement
×