E-Paper
Advertisement

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్
Advertisement

Cunk on Cinema OTT: సినిమాలు చూడటం ఒక ఎత్తయితే.. వాటి గురించి గొప్పగా మాట్లాడటం మరో ఎత్తు. కానీ సినిమా గురించి అసలు ఏమీ తెలియకపోయినా, తనకు అంతా తెలుసన్నట్లు బిల్డప్ ఇస్తూ ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుంది? పైగా ఎదురుగా ఉన్నది సాధారణ వ్యక్తి కాదు.. ప్రముఖ దర్శకులు, నటులు, సినిమా నిపుణులు అయితే ఆ కామెడీ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి విచిత్రమైన హాస్యంతో రూపొందిన బ్రిటిష్ మాక్యుమెంటరీ సిరీస్ ‘Cunk on Cinema’. డయాన్ మోర్గాన్ మరోసారి ఫిలోమెనా కంక్‌గా ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చేశారు. నవంబర్ 15 నుంచి ఈ సిరీస్ Netflixలో అందుబాటులోకి వస్తోంది. మరి సినిమా చరిత్రను కంక్ ఎలా అర్థం చేసుకుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే

కంక్ ఆన్ సినిమా అనేది ఒక సరదాగా సాగే వ్యంగ్య డాక్యుమెంటరీ (mockumentary) సిరీస్. ఇందులో ఫిలోమెనా కంక్ అనే ఒక అమాయకపు రిపోర్టర్, వందేళ్లకు పైగా ఉన్న సినిమా చరిత్ర గురించి మనకు వివరిస్తుంది. అసలు సినిమా అంటే ఏమీ తెలియని ఆమె, తానేదో పెద్ద మేధావిలా బిల్డప్ ఇస్తూ 1800ల నాటి కదిలే బొమ్మల నుండి నేటి మోడ్రన్ సినిమాల వరకు ప్రయాణం చేస్తుంది.

Advertisement

ఈ ప్రయాణంలో ఆమె పాత కాలపు మూకీ సినిమాలు, హాలీవుడ్ స్వర్ణయుగం, ఆ తర్వాత వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాలు, సీజీఐ (CGI), ఇప్పటి ఏఐ (AI) టెక్నాలజీ వరకు అన్నింటినీ తనదైన వింత శైలిలో విశ్లేషిస్తుంది. ఈ క్రమంలో ఆమె నిజమైన సినిమా చరిత్రకారులు, విమర్శకులను కలుస్తుంది. వాళ్ళు ఎంతో సీరియస్‌గా సినిమా గొప్పతనం గురించి చెప్తుంటే, కంక్ మాత్రం సంబంధం లేని అతి తెలివి ప్రశ్నలు అడుగుతూ వాళ్ళను తికమక పెడుతుంది.

సిరీస్ మధ్యలో బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్, మైఖేల్ బే వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేస్తుంది. ఉదాహరణకు, థియేటర్ పెద్ద స్క్రీన్ కోసం తీసిన సినిమాలను, మన ఇంట్లో ఉండే చిన్న టీవీలలో చూపించడానికి మళ్లీ చిన్న సైజు నటులతో షూట్ చేస్తారా అని దర్శకుడు మైఖేల్ బేను అడిగి నవ్విస్తుంది. మొత్తానికి సినిమా చరిత్రను సీరియస్‌గా కాకుండా, కడుపుబ్బా నవ్వించే కామెడీతో చెప్పడమే ఈ సిరీస్ అసలు కథ.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే? 

Advertisement

ఈ సిరీస్‌లో ఫిలోమెనా కంక్ పాత్రలో డయాన్ మోర్గాన్ లీడ్ రోల్ లో నటించారు. చార్లీ బ్రూకర్ ఈ సిరీస్‌ను రూపొందించడంతో పాటు రచనా బృందానికి నాయకత్వం వహించారు. అల్ క్యాంప్‌బెల్ దర్శకత్వం వహించారు. BBC కోసం రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 12, 2026న BBC iPlayerలో ప్రీమియర్ అయింది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం నవంబర్ 15 నుంచి Netflixలో ఆరు చిన్న ఎపిసోడ్‌లుగా అందుబాటులోకి వస్తోంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 15 నిమిషాల నిడివితో ఉంటుంది.

Read Also: ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్

Tags

Related News

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ

ఊరు మొత్తాన్ని వణికించే వింత జీవులు… ఒక్క రాత్రిలోనే రక్తపాతం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై హారర్

ప్లేబాయ్‌కి బుద్ధి చెప్పబోయి ప్రేమలోనే పడితే… ఓటీటీలో దుమ్మురేపుతున్న రోమ్‌కామ్

భార్యపై దారుణ దాడి.. దొంగల పేరుతో భర్త డ్రామా.. ఈ క్రైమ్ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా!

20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×