OTT Movie : భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంటుంది. చాలావరకు రియల్ స్టోరీ లను సినిమాలుగా తీసి సక్సెస్ అయ్యారు మేకర్స్. కొన్ని సినిమాల్లో చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల జరుగుతున్న, మనకు జరిగిన స్టోరీలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా కొంతమంది జీవితాల చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో కూడా మంచి విజయాన్ని సాధించి, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీని ఒంటరిగా చూడటమే మంచిది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ (Lipstick under my burkha). 2016లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. ఇందులో రత్న పాఠక్, కొంకణా సేన్ శర్మ, అహానా కుమ్రా, ప్లాబితా బోర్తకూర్ నటించగా, సుశాంత్ సింగ్, సోనాల్ ఝా, విక్రాంత్ మాస్సే, శశాంక్ అరోరా, వైభవ్ తత్వవాది సహాయక పాత్రలు పోషించారు. స్వేచ్ఛ కోసం తపించే నలుగురు మహిళల జీవితాలను ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ టోక్యో, ముంబై ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి, అక్కడ స్పిరిట్ ఆఫ్ ఆసియా ప్రైజ్, లింగ సమానత్వంపై ఉత్తమ చిత్రంగా ఆక్స్‌ఫామ్ అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఉష అనే 60 సంవత్సరాలు పైబడిన ఒక మహిళ, అపార్ట్మెంట్ ని రన్ చేస్తూ ఉంటుంది. అందులో కొంతమంది అద్దెకు ఉంటూ నివసిస్తుంటారు. అక్కడ నివాసిస్తున్నరెహానా, షరీన్, లీల వీరి చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఉషా కి చిన్నప్పుడే భర్త చనిపోవడంతో, మరో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతుంది. అయితే ఆమెలో ఉన్న కోరికలను చంపలేకపోతుంది. ఉష అక్కడే స్విమ్మింగ్ పూల్ లో పనిచేసే ఒక యువకుడితో పరిచయం అవుతుంది. అతడు బాగా యంగ్ గా ఉంటాడు. ఈమె ముసలి వయసులో ఉంటుంది. అయితే ఫోన్లో మాత్రం అతనితో మాట్లాడుతూ తృప్తి పడుతూ ఉంటుంది. అలాగే రొమాంటిక్ నవలలు కూడా చదువుతూ ఆనందిస్తుంది. ఇది ఇలా ఉంటే రెహనా అనే చదువుకునే అమ్మాయికి ఇంట్లో వాళ్ళు చాలా ఆంక్షలు విధిస్తారు. స్వతంత్రంగా బ్రతకలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది రెహనా.
మరోవైపు లీలా, హర్షద్ ని ప్రేమిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అతనితో పెళ్లికి ఒప్పుకోరు. వేరొకరితో పెళ్లిని నిశ్చయించి ఫంక్షన్ కూడా చేస్తారు. అదే ఫంక్షన్ లో లీలా, హర్షద్ తో ఏకాంతంగా గడుపుతుంది. ఇది చూసిన తల్లి కూడా, అతనికి వార్నింగ్ ఇచ్చి పంపుతుంది. ఈ కథ ఇలా ఉంటే మరోవైపు షరీన్ ఒక సేల్స్ గర్ల్ గా పని చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని భర్త మాత్రం ఒక పడక సుఖం అందించే మనిషిగా మాత్రమే చూస్తాడు. ఒక మృగంలా ఆమె పై రెచ్చిపోతూ ఉంటాడు. చివరికి వీళ్ళ జీవితాలు ఏమవుతాయనేదే ఈ స్టోరీ. ఇదివరకే చూడకపోయినా, ఈ వీకెండ్ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.