OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి కథలను చక్కగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూవీలో ఒక వ్యక్తి ఆడవాళ్ళు, మగవాళ్ళ కన్నా తక్కువనే ఫీలింగ్ లో ఉంటాడు. పడక సుఖం కోసమే వీళ్ళు ఉంటారని అపోహలో బతుకుతూ ఉంటాడు. ఆడవాళ్ళను కూడా అదే దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆ వింత వ్యక్తి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో
ఈ మలయాళం డ్రామా మూవీ పేరు ‘తిమిరం’ (Thimiram). 2019 లో రిలీజ్ అయిన ఈ మూవీకి శివరామ్ మోనీ దర్శకత్వం వహించారు. ఇందులో కె.కె. సుధాకరన్, విశాక్ నాయర్, మీరా నాయర్ నటించారు. ఈ మూవీ 18వ చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఇది “సమాజం పురుష దురహంకారాన్ని ఎలా సాధారణీకరిస్తుందనే దాని గురించి బాగా వ్రాసిన చిత్రం” అని చెప్పబడింది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నీ స్ట్రీమ్ (Nee Stream), సైనా ప్లే (Saina play) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సుధాకర్ ను అతని తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్లు తక్కువ అన్నట్టుగా పెంచుతారు. కొడుకును మంచిగా చూసుకుంటూ, కూతురిని అంతగా పట్టించుకోరు. అలా పెద్దయ్యాక సుధాకర్ కి ఒక అలవాటు కూడా వస్తుంది. ఎవరైనా ఏకాంతంగా గడుపుతూ ఉంటే వాళ్లను దొంగ చాటుగా చూస్తూ ఉంటాడు. ప్రజెంట్ లో ఇతనికి 70 సంవత్సరాల వయసు వస్తుంది. అతనికి రామ్ అనే కొడుకు, వందన అనే కోడలు కూడా ఉంటుంది. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కావడంతో, కట్నం లేకుండానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రామ్. సుధాకర్ ఈ విషయం మీద చాలా కోపంగా ఉంటాడు. మీ వల్ల నాకు ఖర్చులు పెరుగుతున్నాయని చిరాకు పడతాడు. ఇతడు కొన్ని మసాలా ప్యాకెట్లు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తాడు. ఈ క్రమంలో పుష్పమ్మ అనే మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు సుధాకర్. ఈ విషయం తెలిసిన పుష్పమ్మ కొడుకు అతనిపై కేసు పెడతాడు. కావాలనే నన్ను ఇరికించిందని, నీను ఆ ఉద్దేశంతో వెళ్లలేదని పోలీసులకు చెప్తాడు. పోలీసులు సుధాకర్ కి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు.
మరోవైపు కొడుకు సినిమా కథలు రాస్తుంటాడు. ఒక సినిమా అవకాశం వస్తే తండ్రికి కంటి ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. అయితే ఇప్పుడు తండ్రి చేసిన పనికి బాగా డిసప్పాయింట్ అవుతాడు. కోడలు తన నగలను అమ్మి సుధాకర్ కి కంటి ఆపరేషన్ చేపిస్తుంది. కంటి చూపు బాగా రావడంతో సంతోషపడతాడు సుధాకర్. అయితే కొడుకు, కోడలు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో సుధాకర్ దొంగ చాటున చూస్తాడు. ఈ విషయం కోడలికి తెలిసిపోతుంది. భర్తకు చెప్పి నీ తండ్రి ఎలాంటివాడు అని బాధపడుతుంది. చివరికి సుధాకర్ తన తప్పును తెలుసుకుంటాడా? తండ్రి చేసిన పనులకు, కొడుకు ఏం చేస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.